Political Attacks in AndraPradesh : ఇది ప్రజాస్వామ్యం. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, నచ్చిన వ్యక్తిని బలపరిచే హక్కు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కు అందరికీ ఉంటుంది. కానీ, అవి చెల్లవు అంటోంది. వైఎస్సార్సీపీ. చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాడులు తారాస్థాయికి చేరాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. ప్రజల శాంతియుత జీవనానికి భంగం కలిగించేలా, ఓటర్ల ఆలోచనలను మళ్లించేలా ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఒక్క పార్టీ కాదు.. ఒక్క ప్రాంతానికీ పరిమితం కాలేదు.. అధికార వైఎస్సార్సీపీ నేతల దాడుల్లో అన్ని పార్టీల వాళ్లూ బాధితులుగా మిగిలిపోయారు.
'అబ్బయ్యా ఇదేందయ్యా?!'- కాంగ్రెస్ వాహనంపై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి - YSRCP Attack
ప్రచార వాహనాలను ధ్వంసం చేశారు. నాయకులను పరిగెత్తించి కొట్టారు. కార్యకర్తలను చితకబాదారు. మహిళలని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇళ్లకు నల్లా కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇదీ ఎన్నికల ప్రచార క్షేత్రంలో అధికార పార్టీ నేతల తీరు. ఇంతా జరుగుతున్నా.. కళ్లెదుటే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా అటు అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు. ప్రేక్షక పాత్రలో ఇమిడిపోయారు.
రెచ్చిపోయిన మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు - రామచంద్ర యాదవ్‌పై దాడి, ప్రచార వాహనాలు ధ్వంసం - Peddireddy vs Ramachandra Yadav
చిత్తూరు జిల్లా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. సదూం మండలం యర్రాతివారిపల్లెలో ప్రచారం నిర్వహిస్తున్న BCYP పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ పై మంత్రి బంధువు వేణుగోపాల్‌రెడ్డి దాడికి యత్నించారు. మంత్రి స్వగ్రామంలోనే ఓట్లు అడిగే ధైర్యం ఉందా అంటూ కార్లు, ప్రచార రథంపై రాళ్లతో విరుచుకుపడ్డారు. పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తరలించడంతో వందలాది వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని విధ్వంసానికి పాల్పడ్డారు. కార్లు ధ్వంసం చేసి ప్రచార వాహనం జనరేటర్‌కు నిప్పంటించారు.
- అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం విఠలం వద్ద టీడీపీ ప్రచార వాహనానికి నిప్పంటించారు. డ్రైవర్ వాహనంలో ఉండగానే ముఖాలకు మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నా వాహనం పూర్తిగా కాలిపోయింది.
- ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో పాల్గొన్నారని గ్రామస్తులపై దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి ప్రచార వాహనంపై వైఎస్సార్సీపీ ఎంఎల్ఏ అబ్బయ్య చౌదరి అనుచరులు విరుచుకుపడ్డారు. జెండాలు పీకేసి అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న మహిళా కార్యకర్తలను జుట్టు పట్టుకుని కిందికి లాగి భౌతిక దాడులకు తెగబడ్డారు.
టీడీపీ ప్రచార రథంపై వైఎస్సార్సీపీ నాయకులు రాళ్ల దాడి - ఓ బాలుడికి గాయం - YSRCP Leaders mob attack
- అనంతపురం జిల్లా కుందుర్పి మండలం, వడ్డేపాళ్యంలో తెలుగుదేశం ప్రచార రథంపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి పాల్పడ్డాయి. రాళ్లు విసరడంతో బాలుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
- నామినేషన్ల సందర్భంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద వైసీపీ మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒకే సమయానికి రాగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ జెండాలను కింద వేసి తొక్కారు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు సైతం ఎదురుదాడికి దిగారు.
- ఎన్నికల అధికారులతో మంత్రి సీదిరి అప్పలరాజు అమర్యాదగా ప్రవర్తించారు. వైసీపీ ప్రచార రథం నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంకోసారి వైసీపీ ప్రచార రథం ఆపితే బాగోదని, ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకో.. తమాషాగా ఉందా అంటూ రెచ్చిపోయారు.
అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేత హల్‌చల్ - టీడీపీ సానుభూతిపరులపై దాడి - YSRCP Leaders Attack on Villagers