ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

బెంగుళూరులో కూర్చుని జగన్ పులిహోర కబుర్లు చెబుతున్నాడు: మంత్రి అనిత - Vangalapudi Anitha Fire on Jagan - VANGALAPUDI ANITHA FIRE ON JAGAN

Vangalapudi Anitha Fire on Jagan: సొంత ఖర్చులతో వరద బాధితులకు ఓ పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్, బెంగుళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం గొప్పగా చెప్తున్నాడని హోంమంత్రి ధ్వజమెత్తారు. వరదల్లో బురద చల్లేందుకే పీటీఎం బాచ్​ని దింపి విషప్రచారం చేస్తున్నాడని దుయ్యబట్టారు.

Vangalapudi Anitha Fire on Jagan
Vangalapudi Anitha Fire on Jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 7:59 PM IST

Vangalapudi Anitha Fire on Jagan :మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయవాడలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొంటుంటే పేటీయం బ్యాచ్‌తో జగన్ విషప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఖర్చులతో వరద బాధితులకు ఓ పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్, బెంగుళూరులో కూర్చుని పులిహోర కబుర్లు మాత్రం గొప్పగా చెప్తున్నాడని అనిత ధ్వజమెత్తారు.

ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బొట్లుపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి వెల్లడించారు. వినాయక మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవో జగన్ ప్రభుత్వం తెచ్చిందేనని మండిపడ్డారు. సీఎం దృష్టికి విషయం వెళ్లిన వెంటనే రూపాయి కూడా వసూలు చేయొద్దన్నారని గుర్తుచేశారు. 42డ్రోన్లు ద్వారా క్లోరినేషన్ చర్యలు కూడా చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.

అమరావతిపై ఫేక్ న్యూస్ నమ్మెద్దు- అదంతా పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్ల దుష్ప్రచారం : మంత్రి నిమ్మల - Minister Rama NAidu Interview

రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది - ప్రతిపక్షం లేదు : రాష్ట్రంలో వరదలపై బెంగుళూరు ప్యాలెస్​లో కూర్చుని జగన్ చేస్తున్న బురద రాజకీయం వెగటు పుట్టిస్తోందని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ తీరు మారకపోతే జగన్, ఆయన పార్టీ కూడా బుడమేరు బురదలో కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారని కానీ జగన్వి షపు ఆలోచనలతో వికృత ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని, ప్రతిపక్షం లేదని జనం గుర్తించారని అన్నారు. జగన్ చెబుతున్నట్లు ప్రజల్లో ఆకలి మంటలు లేవని, వరద పరిస్థితులు చక్కబడుతున్నాయని, జగన్​లో కడుపుమంట ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ నుంచి విరాళంగా ప్రకటించిన రూ.1 కోటి సాయం ఏమయ్యిందో చెప్పాలని, ఒక వేళ బాధితులకు ఇచ్చి ఉంటే ఆ వివరాలు ప్రకటించాలని, లేదంటే అది కూడా ఫేక్ అని ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చేతనైతే ప్రజలకు సాయం చేయాలి తప్ప ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు సరికాదని అన్నారు.

రాజధానిపై జగన్ విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాడు- అమరావతి రైతుల ఆగ్రహం - Amaravati Farmers on Floods

వరదలో బురద రాజకీయాలు :గత పాలకుల పాపాలే ఈ రోజు విజయవాడ ప్రజలకు శాపాలుగా పరిణమించాయని శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఇప్పటికే బుడమేరు వాగు ఉధృతి వల్ల విజయవాడలో దాదాపు రూ. 6,880 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు కాలవ తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినప్పుడు రాజకీయ నాయకులు ప్రజలకు అండగా, బాసటగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే జగన్ అడుగడుగునా ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విషం చిమ్ముతున్నట్లు పేర్కొన్నారు. జగన్ వరదలో కూడా బురద రాజకీయాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలకు ఆయన సహకరించకుండా విమర్శించడం సరికాదన్నారు.

ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra

ABOUT THE AUTHOR

...view details