ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

వివేకా హత్య కేసులో ప్రమాణాలు ఏమయ్యాయి? - నెయ్యి కల్తీపై చర్చకు సిద్ధమా? : అనిత - Anitha on YV Subbareddy and Jagan

Home Minister Anitha on YV Subbareddy and Jagan: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ జగన్​పై హోంమంత్రి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకాను జగన్ చంపించలేదని ముందు ప్రమాణం చేయాలని, తిరుమల లడ్డూ కల్తీపై తర్వాత ప్రమాణం చేయొచ్చని హెద్దేవా చేశారు. విలువలు లేని వాళ్లు ఎన్ని ప్రమాణాలు చేసినా ఉపయోగం లేదని ధ్వజమెత్తారు. తిరుమల దైవంతో పెట్టుకున్నందుకే వైఎస్సార్సీపీకి 11 సీట్లు వచ్చాయన్నారు. దమ్ముంటే జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Home Minister Anitha
Home Minister Anitha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 21, 2024, 7:25 PM IST

Home Minister Anitha on YV Subbareddy and Jagan: జగన్ బాబాయ్ హత్య కేసులో వైవీ సుబ్బారెడ్డి ప్రమాణాలు ఏమయ్యాయని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను జగన్ చంపించలేదని ముందు ప్రమాణం చేస్తే, తిరుమల లడ్డూ కల్తీపై తర్వాత ప్రమాణం చేయొచ్చునని ఎద్దేవా చేశారు. విలువలు లేని వాళ్లు ఎన్ని ప్రమాణాలు చేసినా ఉపయోగం లేదని మండిపడ్డారు.

ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి లేనివాడు ఎన్నిసార్లు అయ్యప్ప మాల వేసుకుంటే ఏంటి ఉపయోగమని, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి​పై హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే ఛైర్మన్ కుర్చీలో కూర్చుని కల్తీ నెయ్యి ఉపయోగిస్తారా అని నిలదీశారు. భక్తి ఉంటే దేవుడి పేరుతో వ్యాపారం చేయాలనుకుంటారా అని ప్రశ్నించారు.

'ఇది ఘోరం, అరాచకం' - తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించాలి: మోహన్​బాబు

Anitha Challenge to YS Jagan: తిరుమల శ్రీవారితో వైఎస్ జగన్ పెట్టుకున్నారు కాబట్టే వైఎస్సార్సీపీకి 11 సీట్లు వచ్చాయని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. చేసిన తప్పులకు పశ్చాత్తాప పడకుండా ఇంకా బుకాయిస్తే పులివెందుల ఎమ్మెల్యే అక్కడ కూడా ఓడిపోతారని మండిపడ్డారు. ప్రెస్​మీట్​ పెట్టి పలికీ పలకలేని మాటలొద్దని, దమ్ముంటే బహిరంగ చర్చకు జగన్ రావాలని సవాల్ విసిరారు. వంద రోజుల పాలనపై చర్చిద్దామన్నా, తిరుమల లడ్డూ కల్తీపై చర్చించేందుకైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినట్లే, తిరుమల లడ్డూనీ కూడా కల్తీ చేశారని మండిపడ్డారు.

ల్యాబ్ రిపోర్టుల గురించి మాట్లాడలేని వాళ్లు, అవి బయటపెట్టిన చంద్రబాబుని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నోటి వెంట వెంకటేశ్వర స్వామే కల్తీపై మాట్లాడించారని అన్నారు. రాజకీయాలకు ఎన్నో వేదికలు ఉంటాయ్ కానీ తిరుమల స్వామి వారినీ రాజకీయాల్లోకి లాగటం దుర్మార్గమని దుయ్యబట్టారు. గతంలో రోజా మంత్రిగా ఉన్నప్పుడు తిరుమల వీఐపీ టిక్కెట్లు అమ్ముకోలేదా అని ప్రశ్నించారు. తిరుమలలో జరిగిన అన్ని అక్రమాలపైనా సమగ్ర విచారణ, శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయం భక్తుల్లో ఉంది - లడ్డూ కల్తీపై పీఠాధిపతుల ఆగ్రహం - Prelates about Tirumala Laddu Issue

ABOUT THE AUTHOR

...view details