తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఎమ్మెల్యే దానం నాగేందర్​పై అనర్హత వేటు పిటిషన్‌ - ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు - HC on Danam Disqualification Plea - HC ON DANAM DISQUALIFICATION PLEA

High Court on MLA Danam Nagender Disqualification Petition : ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్​ఎస్​ శాసనసభ్యుడు కౌశిక్​ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించిన ఉన్నత న్యాయస్థానం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

telangana high court
High Court on MLA Danam Nagender Disqualification Petition

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 7:31 PM IST

High Court on MLA Danam Nagender Disqualification Petition : ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభ వ్యవహారాల కార్యదర్శి, శాసన సభాపతి, శాసనసభ కార్యదర్శి, ఎలక్షన్ కమిషన్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ తరఫున గెలుపొందిన దానం, తర్వాత కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ శాసన సభాపతికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది.

తమ కంప్లైంట్​పై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దానంపై అనర్హత వేటు వేసేలా శాసన సభాపతిని ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. జస్టిస్ విజయ్​సేన్‌ రెడ్డి ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. దానం నాగేందర్​ను సికింద్రాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిందని, ఆయన పార్టీ ఫిరాయించారడానికి ఇదే నిదర్శనమని కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాది సంతోశ్​ కోర్టుకు తెలిపారు.

దానం నాగేందర్​పై అనర్హత పిటిషన్- హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌

ప్రతివాదులకు నోటీసులు : దానం నాగేందర్ పార్టీ మారినా, ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కౌశిక్​ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా, శాసన సభాపతి మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు - HC Issued Notices To MLA Danam

ఈ నెల 10న హైకోర్టుకు బీఆర్​ఎస్​ : దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో బీఆర్ఎస్ (BRS) ఈ నెల 10న హైకోర్టును ఆశ్రయించింది. భారత రాష్ట్ర సమితి తరఫున గెలుపొంది, కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్న బీఆర్ఎస్, సభాపతి ఇంకా స్పందించడం లేదని ఫిర్యాదులో తెలిపింది. దానంపై త్వరగా చర్యలు తీసుకోవాలని సభాపతిని ఆదేశించాలని పిటిషన్​లో పేర్కొంది. ఈ పిటిషన్​పై నేడు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​ గూటికి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్

ABOUT THE AUTHOR

...view details