Harish Rao Fire On Congress Party : పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిల్లాపై గులాబీ జెండా ఎగరవేయాలని, మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ(2 Lakh Loan Waiver) చేయలేదని, 4 వేల రూపాయల పింఛన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఫింఛన్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలని అధికార పార్టీ నాయకులకు సవాలు విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనన్న హరీశ్‌రావు బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్నారు.
గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లారు: హరీశ్‌రావు
స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు తామే ఇచ్చామన్న ఆయన, ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎందుకివ్వలేదో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలన్నారు. భువనగిరి నియోజకవర్గ విసృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తాము భువనగిరిలో ఓడిపోతామని అసలు అనుకోలేదని అభిప్రాయపడ్డారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao Comments on Minister Komati Reddy :ఇటీవల జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దుర్భాషాలాడిన తీరు హేయనీయమైనదిగా అభివర్ణించారు. రైతు బంధు(Rythu Bandhu ) అడగటం తప్పా అని హరీశ్‌రావు నిలదీశారు. పోలీసులను పెట్టి జడ్పీ ఛైర్మన్‌ను బయటికి పంపించారని, అధికారం ఉందని అహంకారంతో కోమటిరెడ్డి ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాల్వకు నీరు వస్తాయా? లేదా అనే దాని మీద కాంగ్రెస్ స్పందించటం లేదని దుయ్యబట్టారు.
‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’గా కాంగ్రెస్ స్టాఫ్ నర్సుల నియామక పత్రాల జారీ : హరీశ్‌రావు