Ganta Srinivasa Rao's comments : ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ప్రజల్లోనే ఉండాలి. గ్లాసు లో టీ తాగితే మళ్లీ శుభ్రం చేసుకుని తాగుతారు. జగన్ మూడు టీలు తాగితే మూడు గ్లాసులు సింక్ లో వదిలేస్తారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పార్టీ చీపురుపల్లి నుంచి పోటీ చేయమని కోరింది. నేను అన్నీ ఆలోచిస్తాను. క్యాడర్ తో పరిశీలిస్తున్నా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ఖాయమని తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. ఓటమి భయంతోనే జగన్ దొంగ ఓట్ల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చీపురుపల్లిలో పోటీ చేయాలన్న పార్టీ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్లు గంటా వెల్లడించారు.
టీడీపీ - జనసేన మేనిఫెస్టోలో స్టీల్‌ప్లాంట్ అంశాన్ని చేర్చుతాం: గంటా శ్రీనివాసరావు
విశాఖలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు గంటా శ్రీనివాసరావు. నారా లోకేశ్ శంఖారావం కార్యక్రమం విజయవంతమైందని, విజయవంతం చేసిన టీడీపీ- జనసేన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్సీపీలో ఒక్కో వికెట్ పడిపోతోందని, వైఎస్సార్సీపీ (YSRCP)లో కీలక వ్యక్తి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని గుర్తు చేశారు. టీడీపీకి కేశినేని (KESINENI)నాని రాజీనామా చేశారు అంటే అక్కడ వారికి టికెట్ లేదని తెలిసి రాజీనామా చేశారని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఉత్తరాంధ్ర లో అయోమయంలో ఉన్నారని తెలిపారు. రాప్తాడు లో జరిగిన సభలో పత్రిక ఫొటోగ్రాఫర్‌పై దాడి హేయమైన చర్య అని గంటా తీవ్రంగా ఖండించారు.
వైఎస్సార్సీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు అన్ని వర్గాలు సిద్ధం : గంటా