MLA Yarlagadda Venkata Rao Comments on Jagan: అసెంబ్లీకి డుమ్మా కొడుతున్న జగన్‌రెడ్డి ప్రజాదర్బార్ పేరిట స్వీకరించిన వినతులను ఎలా పరిష్కరిస్తారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా జగన్ సొంత నిధులతో ఏమైనా సమస్యలు తీరుస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండానే మైక్ సరిగా ఇవ్వరంటూ అడ్డగోలుగా మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఏ హోదా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీలు లోక్‌సభకు, రాజ్యసభకు వెళుతున్నారో చెప్పాలని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసలు వేదికైన అసెంబ్లీని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వినియోగించుకోట్లేదని విమర్శించారు.
విజయవాడలో వంగవీటి మోహన్ రంగా వర్థంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. 11 మందికి ఓటేసి గెలిపించిన ప్రజలపై కూడా జగన్ దాడి చేస్తున్నాడని యార్లగడ్డ మండిపడ్డారు. అసెంబ్లీని చూడకుండానే ఐదేళ్లు గడిచిపోతాయేమో అని ఆ 11మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మదనపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, శాసనసభను అవమానించటం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని అన్నారు. ప్రజలు ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే దానికి తామేం చేయాలని ప్రశ్నించారు. జగన్ శాసనసభనే అవమానిస్తున్నాడని ప్రజలంతా చర్చించుకుంటున్నారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.
బెనిఫిట్ షో, టికెట్ ధరలు చిన్న విషయాలు - సినీ ఇంటర్నేషనల్ హబ్‌గా హైదరాబాద్ మా లక్ష్యం : దిల్‌రాజు
ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తారా: 1994లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అప్పటి ప్రజాప్రతినిధులు శాసనసభకు వచ్చారని యార్లగడ్డ గుర్తు చేశారు. శాసనమండలికి వైఎస్సార్సీపీ సభ్యులు ఎందుకు వెళ్తున్నారని, రాజ్యసభలో, లోక్‌సభలో వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ అక్కడికి ఎందుకు వెళ్తున్నారని యార్లగడ్డ నిలదీశారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా తీసివేయడానికీ అప్పటి సీఎంగా ఉన్న జగన్ సర్వశక్తులు ఒడ్డారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.
జగన్ తీరుతో వారి పార్టీ సభ్యులు కూడా బాధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టే వారికీ మంత్రి పదవులు ఇస్తే ప్రజలు తిరస్కరించారని, అందుకు ప్రజలను నిందిస్తారా అని యార్లగడ్డ మండిపడ్డారు. 1955 నుంచి ఇప్పటివరకు తక్కువ అభివృద్ధి జరిగింది జగన్ ప్రభుత్వంలో కాదా అని ప్రశ్నించారు. భాషపై కూడా దాడి చేసిన ప్రభుత్వం అని విమర్శించారు. 11 మంది శాసనసభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
పులివెందులలో జగన్ ప్రజా దర్బార్ - తోపులాటలో పగిలిపోయిన అద్దాలు
'విద్యుత్ ఛార్జీలను పెంచాలని సిఫార్సు చేసింది జగనే - ఇది తుగ్లక్ చర్యలకు పరాకాష్ట'