తెలంగాణ

telangana

ETV Bharat / politics

చిన్న హోటల్ వద్ద కాన్వాయ్ ఆపిన కేసీఆర్ - రైతులతో బజ్జీ, కాఫీ రుచిచూస్తూ మాాటామంతి - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Ex CM KCR Election Campaign 2024 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస బస్సు యాత్రలతో బిజీగా మారారు. ఇవాళ ఖమ్మం నగరంలో నిర్వహించబోయే రోడుషోకు వెళ్తుండగా, మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తాండాలోని ఓ చిన్న హోటల్ వద్ద కాన్వాయ్ ఆపారు. అక్కడికి వచ్చిన రైతులతో ముచ్చటిస్తూ బజ్జీలు, పకోడీ, కాఫీ రుచి చూశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

Ex CM KCR Election Campaign 2024
Lok Sabha Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 10:39 PM IST

చిన్న హోటల్ వద్ద కాన్వాయ్ ఆపిన కేసీఆర్- రైతులతో బజ్జీ, కాఫీ రుచిచూస్తూ మాాటామంతి

Lok Sabha Elections 2024 :రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. బస్సు యాత్రలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. వరుస రోడు షోలతో లోక్​సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. బస్సుయాత్ర షెడ్యూల్​లో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాకు కేసీఆర్ బయల్దేరారు. వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి వెంట వరంగల్ నుంచి తొర్రూరు దంతాలపల్లి మీదుగా మరిపెడకు చేరుకున్నారు.

జాతీయ పార్టీలు రెండూ బీఆర్​ఎస్​ను దెబ్బతీయాలని చూస్తున్నాయ్‌ : కేసీఆర్ - KCR Election Campaign 2024

మరిపెడకు ముందుగా ఎల్లంపేట స్టేజి తండా వద్ద రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న హోటల్ వద్ద, కాన్వాయ్ ఆపి కిందకు ఆగారు. అనంతరం అక్కడే ఉన్న ఓ చిన్న హోటల్లోకి వెళ్లారు. దీంతో హోటల్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. అక్కడికి వచ్చిన రైతులు, మహిళలతో కేసీఆర్ మాట్లాడారు. పంటలు ఎలా పండుతున్నాయి, రైతు బంధు అందుతుందా, కరెంట్ సరఫరా ఎలా ఉంది, ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయా అని వారిని ప్రశ్నించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు కలిగిన అదనపు లాభం ఏందని వారిని అడిగి తెలుసుకున్నారు. కొందరు మహిళలు తమ సమస్యలను కేసీఆర్​కు విన్నవించారు. వారి బాధలు విన్న కేసీఆర్ వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

హోటల్​లో పకోడీలు, మిర్చీలు, కాఫీ రుచి చూసి, అక్కడికి వచ్చిన రైతులకు ఇచ్చారు. కేసీఆర్ వెంట మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

అనంతరం మరిపెడకు చేరుకున్న బస్సు యాత్రకు స్థానిక ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కణ్నుంచి ఖమ్మం నగరానికి వెళ్లారు. బస్సులో వెళుతున్న కేసీఆర్​ను చూసేందుకు స్థానికులు, బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రహదారి వెంట నిలుచున్నారు. వారందరికి కేసీఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఖమ్మం పట్టణంలో బీఆర్​ఎస్ లోక్ సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు ఓటెయ్యాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కేసీఆర్ రాకతో ఖమ్మం పట్టణం గులాబీమయమైంది.

రాష్ట్రంలో భవన నిర్మాణాల అనుమతులకు కాంగ్రెస్‌ కమీషన్లు అడుగుతోంది : కేసీఆర్‌ - KCR Bus Yatra in Warangal

"రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్​కు ఇప్పుడు పంచాయతీ వచ్చింది - ప్రజల తరఫున కొట్లాడేందుకు కేసీఆర్​ను గెలిపించాలి" - KCR Bus Yatra in Nagarkurnool

ABOUT THE AUTHOR

...view details