ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పండుగలా చంద్రన్న ప్రమాణ స్వీకారోత్సవం - రాష్ట్రం నలుమూలల నుంచి పోటెత్తిన అభిమానగణం - Chandrababu oath taking

Chandrababu oath taking : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అంచనాలకు మించి బయల్దేరిన వారిని నియంత్రించడం పోలీసులకు పెనుసవాలుగా మారింది. దీంతో రహదారులపై వాహనాలు బారులుదీరాయి. ట్రాఫిక్​లో చిక్కుకుపోవడంతో పోలీసులపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 9:58 AM IST

cbn_oath_taking
cbn_oath_taking (ETV Bharat)

Chandrababu oath taking : చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుంచే వాహనాలను అడ్డుకుంటూ పోలీసులు హడావుడి చేస్తున్నారు. విజయవాడలోకి రాకుండా వాహనాలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. కనకదుర్గ వారధి పై బారికేడ్లు అడ్డు పెట్టి ట్రాఫిక్​ నియంత్రిస్తున్నారు.

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - హాజరు కానున్న ప్రధాని మోదీ - Chandrababu Oath Ceremony as CM

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు విజయవాడ తరలి వెళ్లారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం రాష్టంలో పండుగ శోభ ను సంతరించుకుంది. సభలో పాల్గొనేందుకు భారీగా విజయవాడకు తరలి వెళుతున్నారు. దీంతో కోల్ కత్తా జాతీయరహదారి వాహనాలతో రద్దీగా మారింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం డేగరమూడి రెస్ట్ ఏరియాలో పోలీసులు భారీగా వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. సభకు వెళ్లే బస్సులు సైతం బరులుదేరిన వాహనాల వరుసలో ఆగిపోవడంతో ఎలాగైనా తమను పంపించాలని మహిళలు పోలీసులను ప్రాధేయపడుతున్నారు. వాహనాలు భారీగా నిలిచిపోయాయని అర్థం చేసుకొండని పోలీసులు నచ్చచెపుతున్నారు.

వీడిన ఉత్కంఠ - కొత్త మంత్రులు వీరే! - AP New Cabinet Ministers List

కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు గన్నవరం చేరుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలిరావడంతో మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. టోల్ ప్లాజా వద్ద సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో అధికారులు, పోలీసులు చేతులెత్తేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి గన్నవరం వెళ్లేందుకు ఎదురుచూస్తున్నామని కార్యకర్తలు చెప్తున్నారు. పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గంటల తరబడి రోడ్డుపైనే నిరీక్షించాల్సి వస్తుందని కార్యకర్తలు వాపోతున్నారు.

దారులన్నీ కేసరపల్లికే- చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి - Chandrababu swearing in ceremony

ABOUT THE AUTHOR

...view details