ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఉత్కంఠ రేపుతోన్న గుంటూరు రాజకీయాలు- అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు - Excitement Continues in Guntur

Excitement Continues in Guntur TDP Candidates Finalization: గుంటూరు రాజకీయం మరింత ఘాటెక్కక ముందే అభ్యర్థుల వ్యవహారం తేల్చేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలుతో పాటు సీనియర్ నేతలతో సమావేశమై రేసు గుర్రాల ఎంపికపై చర్చించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలకు గానూ 12 సీట్లు తొలి జాబితాలోనే ప్రకటించిన తెలుగుదేశం మరో ఐదుగురు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది.

Excitement_Continues_in_Guntur_TDP_Candidates_Finalization
Excitement_Continues_in_Guntur_TDP_Candidates_Finalization

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 10:00 AM IST

Updated : Feb 28, 2024, 2:29 PM IST

ఉత్కంఠ రేపుతోన్న గుంటూరు రాజకీయాలు- అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు

Excitement Continues in Guntur TDP Candidates Finalization: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు(MP Lavu Srikrishna Devarayu) ఇప్పటికే వైసీపీ(YSRCP)కి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన తెలుగుదేశంలో చేరనుండటం నరసరావుపేట ఎంపీగా పోటీ చేయనుండటం దాదాపు ఖరారైంది.

అయితే తనతోపాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మరో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి కూడా చోటు కల్పించాలని ఆయన చంద్రబాబు(TDP Chief Chandrababu) వద్ద గతంలో ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే ఇసుక మాఫియా(Sand Mafia) ముద్ర ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చేరిక ప్రతిపాదనను చంద్రబాబు సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తికి అధినేత పచ్చజెండా ఊపారు. ఆయన గురజాల సీటు ఆశిస్తున్నారు.

గతంలో ఇక్కడ నుంచి జంగా కృష్ణమూర్తి రెండుసార్లు విజయం సాధించారు. ఇక్కడ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఇంఛార్జ్​గా కొనసాగుతున్నారు. ఆయనను నరసరావుపేట స్థానానికి మార్చే అవకాశం ఉందని సమాచారం. అక్కడ అరవిందబాబు ఇంఛార్జ్​గా ఉండగా నల్లపాటి రాము సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే యరపతినేని శ్రీనివాసరావుపై నరసరావుపేట, గురజాలలోనూ ఐవీఆర్​ఎస్​(I.V.R.S) సర్వే నిర్వహించారు.

విభేదాలు పక్కనపెట్టి విజయానికి కృషి చేయండి- కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం: చంద్రబాబు

అలాగే జంగా కృష్ణమూర్తిపైనా సర్వే చేయించారు. వీరిరువురిలో ఒకరు నరసరావుపేటలో, మరోకరు గురజాలలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఆశావహులపైనా అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. స్థానిక పరిస్థితులు, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తగు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంకా ప్రకటించని పెదకూరపాడు స్థానంపైనా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పెదకూరపాడుకు కొమ్మాలపాటి శ్రీధర్‌ తెలుగుదేశం ఇంఛార్జ్​గా ఉన్నారు. అయితే ఆ స్థానం దక్కించుకునేందుకు బాష్యం ప్రవీణ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఒకరికి సీటు కేటాయించే కసరత్తు జరుగుతోంది.

లావు శ్రీకృష్ణదేవరాయలుతో ఇదే అంశంపై చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. ఇక గుంటూరు పార్లమెంట్‌ స్థానం విషయానికొస్తే సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ రాజకీయాలకు విరామం ప్రకటించడంతో ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్​ను తెలుగుదేశం అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖరారయ్యింది. ఇక గుంటూరు నగర పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఇంకా తేలకపోవడం, ఆశావహులు ఎక్కువగా ఉండడం ఉత్కంఠ రేపుతోంది.

గుంటూరు తూర్పు స్థానానికి మైనార్టీ నేత నజీర్ అహ్మద్ ఇంఛార్జ్​గా ఉండగా వైసీపీ నుంచి సైతం ముస్లిం అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఈ సీటు ముస్లింలకే ఇవ్వాలా లేక ఇతరులకు ఇవ్వాలా అన్న దానిపై అధ్యయనం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు పశ్చిమ స్థానానికి ఇంఛార్జ్​గా ఉన్న కోవెలమూడి రవీంద్ర టికెట్‌ ఆశిస్తుండగా వైద్యుడు శేషయ్య, డేగల ప్రభాకర్, వికాస్‌ ఆసుపత్రి డైరెక్టర్‌, బీసి మహిళా నేత గల్లా మాధవి, మన్నవ మోహన్ కృష్ణ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి తీవ్రమైన డిమాండ్ ఉంది. విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాద్(Retired IRS Officer Daggumalla Prasad), తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి(Tadikonda MLA Undavalli Sridevi), పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు(SC Cell President MS Raju) పోటీపడుతున్నారు.

ఆశావహులు, అసంతృప్తులతో చంద్రబాబు భేటీ - రాజకీయ భవిష్యత్తుకు హామీ

Last Updated : Feb 28, 2024, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details