Ex Minister Harish Rao Farmers Deeksha Against Congress Govt :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు తమ పంటలు తామే కాల్చుకునే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హామీల పేరుతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు విధానాలకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ రెండు రైతు వ్యతిరేక పార్టీలన్నారు. రెండు ప్రభుత్వాలు రైతులను ముంచిన ప్రభుత్వాలే అని విమర్శించారు. వంద రోజులు గడిచినా కాంగ్రెస్ పథకాలు జాడ లేవని, రైతుల కన్నీళ్లకు కారణం అవుతున్న ప్రభుత్వాలు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ సామర్థ్యం లేదు, తెలియదు : కేసీఆర్ - LOK SABHA Election 2024
"వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్యలు. కరెంటు లేదు, నీళ్లు లేవు కన్నీళ్లే మిగిలాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.20 లక్షలు ఇవ్వాలి. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి. రైతుబంధు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలి. వరి పండించిన రైతుకు రూ.500 బోనస్ ఇవ్వాలి. రైతులకు మేలు చేసే దాకా బీఆర్ఎస్ పోరాడుతుంది."- హరీశ్‌రావు, మాజీ మంత్రి
BRS Leaders Protest Against Congress :కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పంట పరిహారం అందించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు రైతు నిరసన దీక్ష చేపట్టారు. వరి గొలుసులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అకాల వర్షాలతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం - ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి : పల్లా - BRS MLA Palla on Untimely Rains
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజు చేయాలని సదుద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ హయాంలో సాగుకు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ముఖంలో ఆనందం కరువైందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించేంతవరకు రైతుల పక్షాన పోరాడుతామని చందర్ అన్నారు.
కాంగ్రెస్ హయాంలో రైతులు తమ పంటలు తామే కాల్చుకునే పరిస్థితి వచ్చింది హరీశ్‌రావు వసూళ్లపై ఉన్నంత శ్రద్ద ప్రభుత్వానికి రైతుల సమస్యలపై లేదు : జగదీశ్ రెడ్డి