EX CM Jagan Fire on Government :పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. రషీద్ కుటుంబ సభ్యులను వివిధ నాటకీయం పరిణామాల నుడుమ వైఎస్సార్సీపీ అధినేత జగన్ పరామర్శించారు. జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో పోలీసులు భారీగా మోహరించారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతి భద్రతలు ఏమీ బాగోలేవు :రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై వచ్చే బుధవారం దిల్లీలో ధర్నా చేస్తామని జగన్ చెప్పారు. గత నెల రోజులు నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమీ బాగోలేవని, రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి అపాయింట్‌మెంట్లు అడుగుతున్నామని తెలిపారు. అపాయింట్‌మెంట్ ఇస్తే రాష్ట్రంలోని శాంతి భద్రతల గురించి వివరిస్తామని వెల్లడించారు.
ఫేక్ పాలిటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ జగన్ - ధ్వజమెత్తిన టీడీపీ శ్రేణులు - jagan fake publicity