తెలంగాణ

telangana

ETV Bharat / politics

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్? - ETELA RAJENDER TELANGANA BJP NEW CHIEF

Etela Rajender Telangana BJP Chief : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ నియామకం కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

MP Eatala Rajender Telangana BJP Chief
MP Eatala Rajender Telangana BJP Chief (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 10, 2024, 10:56 AM IST

Updated : Jun 10, 2024, 2:21 PM IST

Etela Rajender Telangana BJP President :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డిని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అధ్యక్ష పదవి కోసం కొంతమంది నాయకులు దిల్లీలో ఉండి లాబీయింగ్​ చేస్తుంటే పార్టీ శ్రేణుల్లో అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్​లకు కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కడంతో రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​కు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేడు దిల్లీలో ఈటల రాజేందర్ కేంద్రమంత్రి​ అమిత్​ షాతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అమిత్​ షాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకు అనూహ్యంగా బండి సంజయ్​ని పక్కన పెట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అదనంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

కిషన్ రెడ్డి సారథ్యంలో అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ మంచి సీట్లు, ఓట్లు సాధించింది. రెండోసారి మోదీ కేబినెట్​కు కిషన్ రెడ్డి ఎంపిక కావడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈటలకు ఈ బాధ్యతలు కట్టబెడతారని విశ్వసనీయ సమాచారం. అలాగే కేంద్ర సహాయ మంత్రి అయిన బండి సంజయ్​ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. కేంద్రమంత్రి అయిన బండి సంజయ్​ను ఈటల రాజేందర్​ కలిశారు. దిల్లీలో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

మల్కాజిగిరిలో 3.86 ఓట్ల మెజారిటీతో ఈటల గెలుపు :పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ తన ప్రత్యర్థి కాంగ్రెస్​ నేత సునీత మహేందర్​ రెడ్డిపై 3.86 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా వారు రాజకీయపరంగా అత్యున్నత శిఖరాలకు వెళతారనేది ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడితే ఈ ఆనవాయితీ కొనసాగినట్లవుతుంది.

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్​రెడ్డి - KISHAN REDDY oath as Union Minister

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్ - Bandi Sanjay oath as Union Minister

Last Updated : Jun 10, 2024, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details