Eluru Mayor join in TDP :ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో ఆ పార్టీ భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు నేతలు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి వైఎస్సార్సీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.
అన్న క్యాంటీన్లపై సైకో జగన్ బ్యాచ్ విష ప్రచారం : నారా లోకేశ్ - Tanuku Anna Canteen Issue
ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు నేతలు సైకిలెక్కారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ లోకేశ్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి వైఎస్సార్సీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.