ECI Clarity on Postal Ballots Counting :పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌పై ఎన్నికల అధికారి సీల్ లేకపోయినా సదరు బ్యాలెట్‌ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏపై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని తెలిపింది. పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సీపై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించ రాదని ఈసీ ఆదేశించింది.
ఫాం 13 ఏలో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించ వచ్చని స్పష్టం చేసింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకపోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలను జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ పంపించారు.
ఎన్నికలు 2024
EC Review on Votes Counting:జూన్ 4న ఎన్నికల ఫలితాల లెక్కింపు నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ సమీక్ష నిర్వహించింది. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సీఈఓలు, జిల్లాల అధికారులతో కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమానికి సీఈఓ ముఖేష్ కుమార్ మీనాతో పాటు అదనపు సీఈఓలు, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ - ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు - Arrangements For Counting Of Votes
ఆందోళనల మధ్య పోస్టల్ బ్యాలెట్ పోలింగ్:రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.30 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకుగానూ, 3.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల 12- డి ఫారాలు అందడంలో జాప్యం జరిగింది. అయితే వారికోసం కొంత గడువు కూడా సీఈఓ ఇచ్చారు. సెక్యూరిటీకి డ్యూటీకి వెళ్లిన వారికీ అవకాశం ఇచ్చారు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఆందోళనల మధ్య పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరగగా మొత్తంగా 1.10 శాతం మేర పోలింగ్ నమోదైంది.
కేంద్ర ఎన్నికల సంఘం చొరవ - ఓటు హక్కు వినియోగించుకున్న దంపతులు