తెలంగాణ

telangana

ETV Bharat / politics

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - హాట్ ​హాట్​గా అగ్రనేతల ప్రసంగాలు - Lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Election Campaign In Telangana‍ 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌ రానుండటంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచుతున్నాయి. ఊరువాడా చుట్టేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా జనంలోకి వెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీల విధానాలను ఎండగడుతూ తాము గెలిస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో పార్టీల అగ్రనాయకత్వం త్వరలోనే రంగంలోకి దిగనుంది.

Telangana Loksabha elections 2024
Election Campaign In Telangana‍ 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 7:14 AM IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - హాట్ ​హాట్​గా ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రసంగాలు

Election Campaign In Telangana‍ 2024: హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌ పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేసిన ఆయన ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను కండువా కప్పి ఆహ్వానించారు. వేల్పూర్ మండలం లాక్కోరాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఎంపీగా గెలిచిన ఏడాదిలోనే ముత్యంపేట, బోధన్‌ చక్కెర కర్మాగారాలను తెరిపిస్తానని జీవన్‌రెడ్డి తెలిపారు.

Congress Lok Sabha Elections Campaign 2024 :ప్రధాని మోదీ భారతదేశాన్ని పాకిస్థాన్​తో పోల్చి దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మణుగూరులో పర్యటించిన సీతక్క, అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయం వచ్చిందంటే దేశ సైనికుల సమస్యలు, మరణాలు, చాయ్​వాలా, పాకిస్థాన్ వంటి విషయాలే బీజేపీకి గుర్తుకు వస్తాయన్నారు.మహబూబాబాద్‌లో బలరాంనాయక్‌ గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

మే మొదటివారంలో రాష్ట్రానికి ప్రియాంక - మిర్యాలగూడ, చౌట్‌ప్పల్​లో భారీ బహిరంగ సభలు - lok sabha elections 2024

"ప్రధాని మోదీ మాట్లాడితే చాలు మన దేశాన్ని పాకిస్థాన్​తో పోల్చుతున్నారు. ఈ దేశ గౌరవాన్ని కుల, మత రాజకీయాలకు అధికారం కోసం పాక్​తో పోల్చి ఇండియా ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నారు. ఎన్నికలు రాగానే సైనిక సమస్యలు, చాయ్​వాలా, పాకిస్థాన్​ ఇవే గుర్తొస్తున్నాయి తప్ప పదేళ్ల బీజేపీ పాలనలో మీరు ఏమి అభివృద్ధి చేశారో ఎందుకు చెప్పటం లేదు." -సీతక్క, మంత్రి

BJP Elections Campaign 2024 :నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగినబీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత, మాజీ ఎమ్మెల్యే రాంచందర్‌రావు పాల్గొన్నారు. 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి బీజేపీ జెండా ఎగరవేస్తామని వారు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఐదు గ్యారంటీలంటూ ప్రజలకు చెంపదెబ్బలా కాంగ్రెస్ గుణపాఠం చెప్పిందని ఆయన విమర్శించారు.

నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని బసవతారక నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ చాయ్‌పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్న ఆయన స్థానిక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నిలదీయాలన్నారు. చక్కెర కర్మాగారం విషయంలో కాంగ్రెస్‌వి మోసపూరిత కమిటీలని తనను మళ్లీ గెలిపిస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు.

BRS Elections Campaign 2024 : హామీలు అమలుచేయలేకనే ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో కాంగ్రెస్‌ కొత్త నాటకానికి తెరతీసిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో జరిగిన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఒక్క బాధితుడు ఇప్పటివరకు బయటకు రాలేదన్నారు. మల్కాజ్‌గిరి స్వతంత్ర అభ్యర్థి పెండ్యాల శేషసాయి వరప్రసాద్ ప్రచార వాహనాలను ప్రారంభించారు.

ప్రధాని పదేపదే భారత్​ను పాక్​తో పోల్చి దేశ గౌరవాన్ని తగ్గిస్తున్నారు : మంత్రి సీతక్క - Minister Seethakka Counter to Modi

సీఎం గుంపు మేస్త్రీ అయితే ప్రధాని తాపీ మేస్త్రీ - ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు : కేటీఆర్ - KTR Satires on CM Revanth PM Modi

ABOUT THE AUTHOR

...view details