Betting on AP Elections : ఇది బొమ్మా, బొరుసు కాదు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు! ఐదేళ్ల పాలనపై ఆంధ్రావని తీర్పు! ఐదున్నర కోట్ల ప్రజలు కోరిన మార్పు! ఆగ్రహం కట్టలు తెగింది. ఆవేదన పెల్లుబికింది. 'ఇక చాలు' అంటూ ఇచ్చిన దిమ్మదిరిగే తీర్పుతో వైఎస్సార్సీపీ నేతలకు గర్వభంగం కలిగింది. దాదాపు నూరు రోజుల నిరీక్షణకు తెరపడింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో వైఎస్సార్సీపీని నమ్ముకున్న వాళ్లంతా గోదాట్లో మునిగారు. ఇల్లు, పొలాలు, నగలు తాకట్టు పెట్టిన సొమ్మంతా ఊడ్చుకుపోయి వీధిన పడ్డారు.
ఎన్నికల ఫలితాల వేళ ఏపీలో 'అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే జేబులు ఖాళీ ఆయెనే' అనే పల్లవి పాపులరైపోయింది. వైఎస్సార్సీపీ నేతలతోపాటు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో బెట్టింగ్ పెట్టిన వారందరికీ యథాలాపంగా ఈ పాట గుర్తొచ్చి కన్నీటి వరద పారిస్తోంది. 'నిలువు దోపిడీ దేవుడికిచ్చినా ఫలితం దక్కేది. ఎంతో పుణ్యం దక్కేది' చరణం పదే పదే గుర్తొస్తూ ఒళ్లంతా గుచ్చుకుంటోంది.
వైఎస్సార్సీపీ గెలుస్తుందంటూ గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి తనకున్న మూడెకరాలు పందెం కట్టాడు. ప్రత్యర్థులు ఓడితే బదులుగా అర ఎకరం ఇచ్చినా సరే అంటూ బెట్టింగ్‌లోకి దిగాడు. తీరా యావదాస్తినంతా పోగొట్టుకుని కుటుంబాన్ని వీధినపడేశాడు. కాకినాడలో మరో వ్యాపారి వైఎస్సార్సీపీపై పందెం వేసి చేతులు కాల్చుకున్నాడు. ఇక పిఠాపురంలో పవన్ మెజార్టీపైనా కోట్ల రూపాయల బెట్టింగ్ నడిచిందనేది బహిరంగ రహస్యమే. సెల్ఫోన్లు మొదలుకుని ప్లాట్లు, పంట భూములు ఎన్నికల పందేల్లో చేతులు మారాయి.
వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు కూడగట్టి - ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ 'పవర్' గేమ్ - Pawan Politics in AP
ఏపీలో దిమ్మదిరిగే తీర్పు :ఎన్నికల నోటిఫికేషన్ విడుదలే ఆలస్యం గెలుపెవరిది? అనే చర్చ మొదలైంది. ఆయా పార్టీల అభ్యర్థుల ప్రకటనతో అది కాస్తా బెట్టింగ్‌కు దారితీసింది. పోలింగ్ సమీపించే కొద్దీ బుకీలు రంగంలోకి దిగారు. మీడియా సర్వేలు ముందుంచి బెట్టింగ్ రాయుళ్లను ఆహ్వానించారు. సర్వేల్లో కూటమి ఆధిక్యం కనబర్చిన నేపథ్యంలో పందెం రాయళ్లంతా అటు వైపే మొగ్గు చూపారు. సరిగ్గా ఇక్కడే బెట్టింగ్ మరో మలుపు తీసుకుంది. గెలుపెవరిదో దాదాపు ఖాయమైంది. కాకపోతే ఎవరికెన్ని స్థానాలు, మెజార్టీ ఎంత అనే దానిపై బెట్టింగ్ మొదలైంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ముందుకొచ్చే వారి సంఖ్య తగ్గిపోగా, ఆ పార్టీ ఎన్ని స్థానాలకు పరిమితమవుతుందనేది బెట్టింగ్ ప్రధానాంశమై పోయింది.
వైఎస్సార్సీపీ 50 లేదంటే 60లోపు స్థానాలకే పరిమితమవుతుందనే పందెం జోరుగా సాగింది. ప్రాంతాల వారీగానూ గెలుపోటములు, సీట్ల సంఖ్యపై పందేలు నడిచాయి. రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరిది పైచేయి కానుందనే విషయంలో మరో బెట్టింగ్ నడిచింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని, అధికార పార్టీ పది లోపు స్థానాలతో సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందనే బెట్టింగ్ జోరందుకుంది.
ప్రముఖులు పోటీ చేసే స్థానాల్లో మెజార్టీపై తీవ్ర స్థాయిలో బెట్టింగ్ కొనసాగింది. చంద్రబాబు పోటీచేసిన కుప్పం, పవన్ కళ్యాణ్ పోటి చేసిన పిఠాపురం, లోకేశ్ పోటీచేసిన మంగళగిరి, జగన్ నియోజకవర్గమైన కడపలో మెజార్టీపై బెట్టింగ్ కట్టారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ రాష్ట్రంలోనే రికార్టు లిఖిస్తుందని బెట్టింగ్ ఆహ్వానించిన బుకీలు లక్షకు మూడు లక్షలు ఆఫర్ చేయడం గమనార్హం.
ఏపీలో ఎదురులేని కూటమి - విశ్వరూపం చూపించిన చంద్రబాబు - TDP BJP Janasena Alliance 2024
జిల్లాలకు జిల్లాలే క్లీన్ స్వీప్ - భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోన్న కూటమి - Hello AP Bye Bye YCP