EC Suspends 106 Govt Employees in Telangana : ఎన్నికల కోడ్ ఉల్లఘించి మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సభలో పాల్గొన్న 106 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్ ఉద్యోగులతో మెదక్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై కేసు నమోదైంది.
ఈ విషయంపై ఎన్నికల ఫ్లయింగ్ స్వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి అనంతరం వారికి భోజన, వసతి ఏర్పాట్లు కూడా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించడం కోడ్‌ను ఉల్లంఘించడమేనని, నిబంధనల ఉల్లంఘన మేరకు వెంకటరామి రెడ్డి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.
బీఆర్ఎస్కు షాక్ - మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు - case register on Venkatarami Reddy
బీజేపీ రఘునందనరావు స్పందన:ఈ ఘటనపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఇటీవల స్పందించారు. వెంకటరామిరెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని సీఈవోను (CEO) కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెంకట రామిరెడ్డి సమావేశమయ్యారని తెలిపారు. వెంకట రామిరెడ్డి సమావేశం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చేసరికి అందరూ పారిపోయారని రఘునందన్ రావు వివరించారు.
వెంకట రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు చేసే తప్పుడు పనుల్లో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని, తాను న్యాయపరంగా తీసుకునే చర్యల్లో ఉద్యోగులు నష్టపోవద్దని సూచించారు. వెంకట రామిరెడ్డిపైరఘునందన్ రావు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఆధారంగా వెంకట రామిరెడ్డిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేయాలని రఘునందన్‌రావు కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెల్లాపూర్‌లో వెంకట రామిరెడ్డి నివాసం రాజపుష్ప నుంచి కోట్ల రుపాయలు ఎన్నికల కోసం తరలించారని ఆరోపించారు.
40 రోజులు నా కోసం పని చేయండి - గెలిస్తే 5 ఏళ్లు మీ వెంటే ఉంటా : వెంకట్రామి రెడ్డి - BRS Meeting in Medak
విధుల్లో పక్షపాతం వహించారని- ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు