Dissatisfaction Among YSRCP Activists in Kovuru Constituency :వైసీపీ నేతల తీరుపై సామాన్య పౌరుల్లోనే కాదు, ఆ పార్టీ కేడర్లోనూ అసంతృప్తి నెలకొని ఉంది. నియోజక వర్గాల్లో స్థానిక నాయకులపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది స్థానిక నాయకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కొంత మంది ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు వైసీపీని వీడి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ గేట్లు తెరిస్తే కృష్ణానదికి వరద వచ్చినట్లు వైసీపీ నేతలు వరస కట్టే విధంగా అధికార నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ప్రతిపక్ష నేతలు తెలిపారు.
వైసీపీలో వర్గ విభేదాలు - ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమావేశాలు
Nellore District: తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైసీపీ కోటకు బీటలు వారుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy)పై వైసీపీ శ్రేణుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. ప్రధాన అనుచరులుగా ఉన్న కైలాసం ఆదిశేషారెడ్డి (Kailasam Adisesha Reddy), ఆయన సతీమణి రేణుక (Renuka) వర్గం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఎమ్మెల్యే సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి (Rajendranath Reddy) బహిరంగంగా విమర్శలు చేశారు. బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వవ్వేరు బ్యాంక్ మాజీ చైర్మన్ సూరం శ్రీనివాసులు రెడ్డి (Suram Srinivasulu Reddy) టీడీపీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుందని, ఆయన అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారని తెలియజేశారు.