Danam Nagender Comments on BRS MLAs in Assembly : హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలతో శాసనసభలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయట తిరగనియ్యనంటూ పరుష పదజాలంతో దానం బెదిరింపులకు పాల్పడ్డారు. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. శాసనసభ స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ ఫైర్ - సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ - Danam Nagender fires on BRS MLAs - DANAM NAGENDER FIRES ON BRS MLAS
Danam Nagender on BRS MLAs in Assembly : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట తిరగనివ్వనంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దానం మాటలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.
Published : Aug 2, 2024, 7:23 PM IST
పోడియం దగ్గర నిరసన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులవైపు దానం నాగేందర్ దూసుకెళ్లారు. వెంటనే ఆయనను కాంగ్రెస్ సభ్యులు వెనక్కి లాగారు. ఆ వెంటనే బీఆర్ఎస్ సభ్యులను కేటీఆర్ తీసుకొచ్చారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను దానం నాగేందర్ వెనక్కి తీసుకుంటున్నానని, సభాపతికి క్షమాణలు చెప్పారు. దానం నాగేందర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులపై పరుష పదజాలం ఉపయోగించిన దానంపై ఆందోళన చేపట్టారు. దానం వ్యాఖ్యలపై నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు.