CPI Narayana Fires On KCR : కేసీఆర్ అహంభావం, అవినీతి వల్లే ఉద్యమ పార్టీకి కూడా ప్రజలు బుద్ది చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోతాయా అని పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాశ్వతంగా రామని బాయ్‌కాట్ చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ఎందుకు ఎన్నికల్లో పోటీ చేశారని, గెలిచిన తర్వాత అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ధ్వజమెత్తారు. పదేళ్లు ప్రజా సంపాదనను దోచుకుని, ఇప్పుడు అసెంబ్లీకి పోవడం లేదని విమర్శించారు. ఒకప్పుడు కేసీఆర్ అసెంబ్లీ నుంచి గెంటేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ బీజేపీ బాగా తెలివైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి వ్యవహారాన్ని తేల్చే పని సీబీఐకి అప్పగించాలని కోరుతోంది. సీబీఐకి కేసు అప్పగించి మేనేజ్ చేయాలనుకుంటోంది. కేసీఆర్‌ను కాపాడేందుకు తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నిస్తోంది. రూ.వేల కోట్ల అవినీతికి బాధ్యుడైన కేసీఆర్‌పై విచారణ జరిపించారు. మొన్నటి దాకా బీఆర్ఎస్ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవినీతి చేసిందంతా ఆ పార్టీ నేతలే. సీఎం పదవి ఇస్తే అభివృద్ధి చేస్తామని హరీశ్ రావు అనడం సిగ్గుచేటు. సీఎం పదవి కోసం బీఆర్ఎస్ చాలా ఆరాటపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట. - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
విద్య, వైద్యం మీద ఖర్చులో రాష్ట్రం వెనకబడి ఉంది: కాగ్ నివేదిక
CPI Narayana On Modi Govt :హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన నారాయణ, కేంద్రప్రభుత్వం, ఏపీ రాజకీయాలపైనా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు ద్రోహిలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను విస్మరించడంతోనే రైతులు ఆందోళన చేపట్టారని అన్నారు. మోదీ సర్కార్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉంటే, బీజేపీ ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ఎందుకు కూలగొడుతోందని ప్రశ్నించారు.