తెలంగాణ

telangana

ETV Bharat / politics

సీఎం తీసుకువచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నా : సీపీఐ నారాయణ - CPI Narayana On HYDRA - CPI NARAYANA ON HYDRA

CPI Narayana On HYDRA : అక్రమనిర్మాణాలు కూల్చివేతలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హైడ్రా సంస్థ సమర్థంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.

CPI Narayana Comments On CM Revanth
CPI Narayana Comments On CM Revanth (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 5:15 PM IST

Updated : Aug 26, 2024, 6:01 PM IST

CPI Narayana Comments On CM Revanth :చెరువులు, కాలువల పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. భూముల కబ్జాపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆంధ్రోళ్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని చెప్పిందన్న నారాయణ ఆ తర్వాత మౌనం దాల్చిందని విమర్శించారు. చెరువులు, నాలాలు కబ్జాలు చేయడం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో అర్థం కావటం లేదన్నారు. అర్ధ గంట వర్షం పడితేనే హైదరాబాద్ మునిగిపోతుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారని మీద నుంచి దిగొద్దని దిగితే మింగేసే ప్రమాదం ఉందన్నారు.

చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేస్తున్నాయన్నారు. సర్కారు భూములను కబ్జా చేసి కార్యాలయాలు నడుపుతున్న కార్పొరేట్ శక్తులు చెరువుల్లో నిర్మించిన ప్రభుత్వ ఆఫీసులకు ముడి పెడుతున్నాయని నారాయణ మండిపడ్డారు.

సెబీ, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలి :నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని అయితే అదానీ ప్రపంచానికి కుబేరుడయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సెబీ కూడా అదానీకి దాసోహం అయ్యిందని ఆరోపించారు. సెబీ అదానీకి లొంగిపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం రాబోతుందని హెచ్చరించారు. సెబీ, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. ఫెడరల్(సమాఖ్య) స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారని దీని వల్ల దేశం విచ్ఛిన్నమవుతుందని అవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది :బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో అనేక రాజకీయ మార్పులు సంభవించబోతున్నాయని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆంధ్రోళ్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని చెప్పింది ఆ తరువాత మౌనం దాల్చిందన్నారు. చెరువులు, నాలాలు కబ్జాలు చేయడం వల్ల వర్షపు నీరు ఎటు వెళ్లాలో అర్థం కావటం లేదని అర్ధ గంట వర్షం పడితేనే హైదరాబాద్ మునిగిపోతుందన్నారు.

"అక్రమణలు తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. హైడ్రా సంస్థ సమర్ధవంతంగా పనిచేస్తోంది. పేదవారి ఇళ్లు కూలగొట్టేముందు వారికి ప్రత్యామ్నాయ సౌకర్యాలు కల్పించాక చర్యలు తీసుకుంటే బాగుంటుంది" - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

భవిష్యత్‌ తరాల కోసమే హైడ్రా ఏర్పాటు :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందుతుంటే ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మండిపడ్డారు. 2014 నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అక్రమ నిర్మాణాలకు సపోర్టు చేసిందని ఆరోపించారు. హుస్సేన్‌సాగర్‌ను కాపాడుకోవాలని విజయభాస్కర్ రెడ్డి కాలంలో బుద్దపూర్ణిమ ప్రాజెక్ట్, నెక్లెస్‌ రోడ్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. ధర్మం కోసం భగవద్భీతను కూడా స్ఫూర్తిగా తీసుకున్నానని రేవంత్ చెప్పారన్నారు. హెచ్ఎండీఏలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఆరంభ శూరత్వం కాదు - కూల్చివేతలు ఇలాగే కొనసాగాలి : సీపీఐ నారాయణ - CPI Narayana Visit N Convention

సీఎం పదవి కోసం బీఆర్ఎస్ చాలా ఆరాటపడుతోంది - హరీశ్​రావు అలా అనడం సిగ్గుచేటు : నారాయణ

Last Updated : Aug 26, 2024, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details