తెలంగాణ

telangana

ETV Bharat / politics

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై నేతల అభిప్రాయ సేకరణ చేస్తున్న కాంగ్రెస్​ అధిష్ఠానం - Congress Focus on Second MP List

Congress Taking Opinions of Party Leaders in Lok Sabha Candidates Selection : లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్​ పార్టీ తీవ్ర కసరత్తే చేస్తోంది. నాయకుల అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ అభిప్రాయ సేకరణ గాంధీభవన్​లో రాత్రి వరకు జరిగే అవకాశం ఉంది.

Lok Sabha Candidates Selection
Congress Taking Opinions of Party Leaders in Lok Sabha Candidates Selection

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 5:45 PM IST

Congress Taking Opinions of Party Leaders in Lok Sabha Candidates Selection :తెలంగాణలో పార్లమెంటు కాంగ్రెస్​ అభ్యర్థుల ఎంపికపై నాయకుల అభిప్రాయ సేకరణ(Cong MP Candidates Opinions) కొనసాగుతోంది. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఉదయం ప్రారంభమైన అభిప్రాయ సేకరణ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్​ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు రోహిత్​ చౌదరి, మన్సూర్​ అలీ ఖాన్​, విష్ణునాగ్​లు నాయకుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్​ అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు లోక్​సభ అభ్యర్థుల ఎంపికలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. హైదరాబాద్​, సికింద్రాబాద్​, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాలకు చెందిన నాయకుల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఇప్పటికే నాలుగు లోక్​సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్​ పార్టీ(Congress Announced Lok Sabha Candidates) మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు కొనసాగిస్తోంది. ప్రధానంగా అభ్యర్థులు ఎవరుండాలి, వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణ నాయకుల సహకారం తదితర అంశాలపై ఒక్కొక్కరితో అభిప్రాయాలను తీసుకుంటున్నారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు ముమ్మరం - కొనసాగుతోన్న ఫ్లాష్​​ సర్వేలు

Congress Focus on Second MP List :ఇప్పటికే కాంగ్రెస్​ వ్యూహకర్త సునీల్​ కనుగొలు బృందం మిగిలిన 13 నియోజకవర్గాలకు చెందిన నాయకులపై ఫ్లాష్​ సర్వే(Congress Flash Survey)లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాగర్​ కర్నూల్​ అభ్యర్థి ఎంపికపై మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేశ్​రెడ్డి, గద్వాల జడ్పీ ఛైర్​పర్సన్​ సరిత సహా పలువురు నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

సికింద్రాబాద్​ లోక్​సభ అభ్యర్థిగా మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ కుటుంబానికి సీటు ఇవ్వాలని కాంగ్రెస్​ భావించగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకు ప్రత్యామ్నాయంగా చార్టెడ్​ అకౌంటెంట్​ వేణుగోపాల స్వామి, విద్యా స్రవంతి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి చామల కిరణ్​ కుమార్​ రెడ్డితో పాటు కోమటిరెడ్డి మోహన్​రెడ్డి కుమారుడు సూర్యపవన్​ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. వరంగల్​ స్థానం నుంచి దొమ్మాట సాంబయ్యను కాంగ్రెస్​ ప్రతిపాదించగా, స్టేషన్​ ఘన్​పూర్​కు చెందిన ఇందిర టికెట్​ కావాలని కోరుతున్నారు. అలాగే మరో నేత అద్దంకి దయాకర్​ను అక్కడి నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్​ ఉంది. నిజామాబాద్​లో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డికి ఇవ్వాలని భావించగా, స్థానికంగా వ్యతిరేకత వస్తుంది.

'కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష- ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు'

బీఆర్​ఎస్​కు మరో షాక్ - కాంగ్రెస్​లోకి గుత్తా అమిత్​ రెడ్డి !

ABOUT THE AUTHOR

...view details