రాష్ట్రంలో మరింత మెరుగైన కాంగ్రెస్ పరిస్థితి - 12 లోక్‌సభ స్థానాల్లో పెరిగిన ఓటర్ల శాతం Congress Survey Results : లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, ఇతర ముఖ్య నేతలు సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు పార్టీల వారీగా నిర్వహించిన సర్వేల ఫలితాలను లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
ఇటీవల సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిఫారసు చేసిన ఆశావహుల జాబితాతో పాటు బయట నుంచి పార్టీలో చేరిన, చేరబోతున్న ముఖ్య నాయకుల గెలుపుపై సర్వేలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురు అభ్యర్థులకు చెందిన సర్వేలు నిర్వహించేందుకు వివరాలను సునీల్ కనుగోలుకు అందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలన్న దిశలో కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ - అసెంబ్లీ టికెెట్ రాని వారికే ప్రాధాన్యత!
Sunil Kanugolu Survey on Congress in parliament elections :కేంద్రంలో అధికార మార్పు జరగాలంటే, రాష్ట్రం నుంచి కనీసం 14 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా నాయకులు, మంత్రులతో సమీక్షలు నిర్వహించారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పరిశీలిస్తే, ప్రస్తుతం సగటున 4 నుంచి 5 శాతం కాంగ్రెస్‌కు ఓటర్ల శాతం పెరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చినట్లు సర్వేలో తేలిందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో ముందుకుపోతుండటం, ఆరు గ్యారెంటీల్లో అధికారం చేపట్టిన రెండో రోజుల్లోనే రెండు ప్రారంభించిన ప్రభుత్వం, ఇటీవలే మరో రెండు అమలు చేసేందుకు శ్రీకారం చుట్టడం క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఏర్పడేలా చేసినట్లు తెలుస్తోంది. 12 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లుగా తాజా సర్వేలో స్పష్టం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సామాజిక సమీకరణాల విషయంలో కాంగ్రెస్ ఆచీతూచీ ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అవకాశం ఉన్నంత వరకు రిజర్వేషన్ ద్వారా ఉన్న 12 స్థానాల్లో కనీసం 5 బీసీలకు ఇవ్వాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అగ్రనేతలొస్తే ఓకే లేదంటే మాకే - ఖమ్మం ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయండి - రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశాలు