తెలంగాణ

telangana

ETV Bharat / politics

12 లోక్​సభ స్థానాలపై కాంగ్రెస్ గురి - బూత్‌ స్థాయిలో బలోపేతంపై దృష్టి

Telangana Congress Focus on Parliament Elections 2024 : పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాలకు తగ్గకుండా కచ్చితంగా గెలిచే లక్ష్యంతో కాంగ్రెస్‌ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 25న హైదరాబాద్‌లో బూత్‌ స్థాయి అధ్యక్షులతో మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్‌మెనేజ్‌మెంట్‌పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

Congress Meeting on Lok Sabha Elections
Congress preparations for Lok Sabha Polls 2024

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 7:53 AM IST

Updated : Jan 20, 2024, 11:11 AM IST

12 లోక్​సభ స్థానాలపై కాంగ్రెస్ గురి - బూత్‌ స్థాయిలో బలోపేతంపై దృష్టి

Telangana Congress Focus on Parliament Elections 2024 : పార్లమెంటు ఎన్నికల సమరంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కసరత్తులు చేస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 25న హైదరాబాద్‌లో బూత్‌ స్థాయి అధ్యక్షులతో మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్‌మెనేజ్‌మెంట్‌పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ గురి - బరిలో దిగేందుకు ఆశావహలు రెడీ

Congress Booth Level Coordinators Meeting :అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను గద్దె దించి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో అంతకు మించిన ఫలితాలు సాధించటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని 17స్థానాలకు కనీసం 12 నియోజకవర్గాల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయి తాజా రాజకీయ పరిణామాలపై ఆయా జిల్లాల పార్టీ నేతలతో ఆరా తీశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను అంచనా వేయడంతోపాటు ఇతర పార్టీల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు 2024 - తెలంగాణ నుంచి పోటీకి సోనియా గాంధీ సుముఖత, ఆ స్థానం నుంచే బరిలోకి!

Congress Meeting on Lok Sabha Elections : మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన నేతలను చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలురాని హైదరాబాద్‌, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ రెండు రోజులుగా గాంధీ భవన్‌లో మైనార్టీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్త దిశానిర్దేశం చేస్తున్నారు

CM Revanth Reddy Review on Lok Sabha Elections 2024 :అటు దేశవ్యాప్తంగా బూత్‌ స్థాయిలోనూ పార్టీ బలోపేతం దిశగా కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బూత్‌స్థాయి నేతలతో ఏఐసీసీ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి దాదాపు 36వేల మంది బూత్ స్థాయి సమన్వయకర్తలతో ఈ నెల 25న ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు దీపాదాస్‌ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్‌ నేతలు హాజరై పార్టీపరంగా ముందుకెళ్లే కార్యాచరణపై చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు నిర్ణీత సమయంలో కాకుండా ముందే జరగొచ్చన్న అంచనాలతోఎప్పుడు ఎన్నికలు జరిగిన సిద్ధంగా ఉండేలా పార్టీ నాయకత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది.

కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా మహేష్‌ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ​- ఛాన్స్​ కొట్టేసింది వీరే!

Last Updated : Jan 20, 2024, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details