Congress Focus On Chevella MP Seat :రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో హస్తం పార్టీ(Congress Party) తన హవా చాటాలనుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దింపారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే తన వర్గంతో కలిసి రంగంలోకి దిగిన రంజిత్ రెడ్డి స్థానిక నేతలతో(Local Leaders) వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Congress Party Election Campaign : పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తూనే బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలను, ప్రజలను కోరుతున్నారు. ఎంపీగా ఐదేళ్లపాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో మరింత అభివృద్ధికి పాటుపడతానని ప్రచారం నిర్వహిస్తున్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమ్మిళితంగా ఉండేచేవెళ్లపార్లమెంట్ నియోజకవర్గంలో(Parliamentary Constituency) గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్లలో గులాబీ పార్టీ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) రంజిత్‌రెడ్డి వికారాబాద్ జిల్లా ఇంఛార్జీగా బీఆర్ఎస్ అభ్యర్థుల(BRS Candidates) కోసం పనిచేశారు.
ప్రచారంలో జోష్ పెంచిన కాంగ్రెస్ పార్టీ :అక్కడి కాంగ్రెస్ అభ్యర్థులను(Congress Candidates) ఓడించేందుకు క్షేత్రస్థాయిలో మంతనాలు సాగించారు. ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాల్లో క్యాడర్రంజిత్‌రెడ్డికి ప్రతికూలంగా మారింది. కాంగ్రెస్ క్యాడర్ రంజిత్‌రెడ్డి రాకను మొదట్లో వ్యతిరేకించగా వేం నరేందర్ రెడ్డి సయోధ్య కుదర్చారు. దీంతో రంజిత్‌రెడ్డి గెలుపునకు కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు ప్రకటించడంతో పశ్చిమాన కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది. ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ మహేశ్వరం నియోజకవర్గ ఇంఛార్జి కేఎల్ఆర్ సైతం రంజిత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించి ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లోనూ స్థానిక నేతలు, కార్పొరేటర్లను కలుపుకుంటూ శ్రమిస్తున్నారు.