CM Revanth Reddy on Late EX CM Rosaiah :దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వ్యూహాత్మక వైఖరి, ఆయనతో కలిసి పనిచేసిన చాలా మంది ముఖ్యమంత్రులకు ఉపయోగపడిందని, ప్రస్తుతం అలాంటి నాయకులు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరం ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన రోశయ్య మూడో వర్ధంతి సభకు రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ విడిపోయే నాటికి 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌గా ఉందంటే కారణం రోశయ్యయేనని గుర్తు చేశారు. 2007లో శాసన మండలిలో రోశయ్య తనకు చేసిన సూచన తన ఎదుగుదలకు దోహదపడిందన్నారు. 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో పదవులకు వన్నె తెచ్చారని కొనియాడారు.
"ఈరోజు చట్టసభల్లో ఆయన లాంటి స్ఫూర్తి కొరవడింది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పాలక పక్షాలది ఏదో పోతది అన్నట్లుగా ప్రశ్నించేవారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరముంది. తెలుసుకుని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునే పెట్టే అవకాశముంది." -రేవంత్ రెడ్డి, సీఎం
గ్రూప్-4 విజేతలకు గుడ్‌న్యూస్ - నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్