CM Revanth Reddy Meeting MLAs and MLCs Today : రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 14 స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పీసీసీ పావులు కదుపుతోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం, ప్రతిపక్షాలపై గట్టిగా ఎదురు దాడి చేసేట్లు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పీసీసీ అవగాహన కల్పించనుంది.
Congress Awareness Program on BRS Corruption :కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను (Telangana Budget 2024) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగాపది సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా ప్రభుత్వ వ్యవస్థలను బీఆర్ఎస్ సర్కార్ ఎలా నిర్వీర్యం చేసిందో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అవగాహన కల్పించనున్నారు. ఈ రెండు నెలల్లో పాలనాపరంగా చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు, నిర్వీర్యమైనట్లు చెబుతున్న వ్యవస్థలను చక్కబెట్టేందుకు ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు గురించిముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి వివరిస్తారు. కాంగ్రెస్ సర్కార్ వైఖరిని ప్రజాప్రతినిధులకు ఆయన స్పష్టం చేయనున్నారు.
కేసీఆర్ సర్కార్ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు
Congress Awareness BRS Corruption to Party Representatives : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, వాటి పురోగతి, వాటికైన వ్యయం, సాగులోకి వచ్చిన విస్తీర్ణం తదితర అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు. అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్‌ల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు, అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని వివరించనున్నారు. కృష్ణా, గోదావరిలో నీటి వాటాను సాధించేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వారికి స్పష్టం చేయనున్నారు.