'సికింద్రాబాద్ టికెట్‌ను బీఆర్ఎస్ బీజేపీకి తాకట్టు పెట్టింది - కేసీఆర్‌ను నమ్ముకుంటే పద్మారావు మునిగినట్లే' CM Revanth Lok Sabha Election Campaign : సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలవబోతుందని, కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
పద్మారావు మంచోడే కానీ కేసీఆర్‌ను నమ్ముకుంటే పద్మారావు మునిగిపోతారని బీఆర్ఎస్ అభ్యర్థిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేవలం పద్మారావు పరువు తీయడానికే బీఆర్ఎస్ అధినేత సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు. పద్మారావు నామినేషన్‌కు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎందుకంటే ఆయనకు కేసీఆర్, కేటీఆర్ మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు. సికింద్రాబాద్ టికెట్‌ను బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీ కాలువలో వేసినట్లేనన్నారు.
రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
దేవుడిని బజారులోకి తెచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ : దానం నాగేందర్ ఎంపీగా గెలిస్తే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేంద్రమంత్రిగా ఉండి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని కాపాడింది కాంగ్రెస్సే అంటూ వివరించారు. ఈ క్రమంలోనే దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలన్నారు. కానీ ప్రధాని మోదీ దేవుడిని బజారులోకి తీసుకువచ్చి, మతం చిచ్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
"సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ రాబోతుంది. దానం నాగేందర్ ఎంపీగా గెలిస్తే, కేంద్రంలో కీలకమైన మంత్రి పదవి వస్తుంది. కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారు. పద్మారావు మంచోడే, కేసీఆర్‌ను నమ్ముకుంటే పద్మారావు మునిగినట్లే. పద్మారావు పరువు తీయడానికే సికింద్రాబాద్ అభ్యర్థిని నిలబెట్టారు. పద్మారావు నామినేషన్‌కు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు రాలేదు. సికింద్రాబాద్ టికెట్‌ను బీజేపీకు బీఆర్ఎస్ తాకట్టు పెట్టింది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిందే కాంగ్రెస్. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ప్రధాని మోదీ దేవుడిని బజారులోకి తెచ్చారు. మతం చిచ్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గాలని బీజేపీ చూస్తుంది." - రేవంత్ రెడ్డి, సీఎం
పదేళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రం నాశనమైంది - ఒక్కో పనిని చక్కదిద్దుతూ వస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా? - హరీశ్‌రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్