CM Revanth Reddy Election Campaign in Bhuvanagiri :సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్‌కి మద్దతుగా రోడ్‌షో, కార్నర్ సమావేశాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో స్థానిక స్పిన్నింగ్ మిల్లులో అధికారులు హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరికి చేరుకుంటారు. హైదరాబాద్ చౌరస్తా జగదేవ్ ప్పూర్ రోడ్, పాత బస్టాండ్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాట్లాడతారు.
హెలిప్యాడ్‌తో పాటు కార్నర్ సమావేశం నిర్వహించే స్థలాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది పోలీసుల బందోబస్తు నిర్వహించనున్నారు. రోడ్‌షోలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సీఎం పర్యటనలో పాల్గొనున్నారు.
కేసీఆర్ పిట్టల దొరలా ఏదేదో మాట్లాడుతున్నారు - పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతాం : సీఎం రేవంత్ రెడ్డి - Lok Sabha Nominations In Telangana
CM Revanth Reddy Road Show in Bhuvanagiri :ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి రేవంత్ రెడ్డి భువనగిరి వస్తుండటంతో ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. ఈ మేరకు భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం జరిగే సీఎం రోడ్‌షోలో పార్లమెంటు నియోజకవర్గంలోని మునుగోడు, భువనగిరి, ఆలేరు, నకిరేకల్, తుంగతుర్తిల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేపట్టారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించిన నాయకులు, సీఎం పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Congress Paanch Nyay Manifesto 2024 :లోక్‌సభ అభ్యర్థుల నామినేషన్‌కు ర్యాలి నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కార్యకర్తల నుంచి మొదలు నాయకుల వరకు అందిరి ఏకం చేసి ఎన్నికల్లో గెలుపొందలా జోష్ నింపుతున్నారు. అలాగే బీఆర్ఎస్ వైఫ్యల్యాలను, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే వారు చేసే అభివృద్ధిని ప్రజల్లోని విస్తృతంగా తీసుకెళుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన పాంచ్ న్యాయ్‌ను ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు.
ఈరోజు సాయంత్రం కర్ణాటకకు రేవంత్ - లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం - CM Revanth Reddy Karnataka Tour
రాష్ట్రంలో 14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాం : సీఎం రేవంత్ - Lok Sabha Polls 2024