CM Revanth Reddy Election Campaign in Malkajgiri : కాంగ్రెస్ బలంగా ఉన్నచోట బీఆర్ఎస్ తన మద్దతు బీజేపీకి ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గులాబీ అధినేత కేసీఆర్ బీజేపీ వాళ్లతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు తనను ఆదుకున్నది మల్కాజిగిరి ప్రజలేనని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మల్కాజిగిరిలో జరిగిన ‘జన జాతర’ సభలో ఆయన పాల్గొన్నారు. హస్తం పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు.
CM Revanth Reddy Speech at Malkajgiri: కష్టకాలంలో ఉన్నప్పుడు తనను ఆదుకున్నది మల్కాజిగిరి ప్రజలేనని సీఎం రేవంత్ గుర్తు చేశారు. తనకు అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఇప్పుడు మంచి అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చి మల్కాజిగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఈ నియోజకవర్గాన్ని ఎప్పుడూ మరిచిపోనని, ఇక్కడ ఎంపీగా చేసిన పోరాటంతోనే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని పేర్కొన్నారు. ఆ పదవి తర్వాత సీఎం కూడా అయ్యానని తెలిపారు. రాజకీయాల్లో పడిపోతున్న తనను ఉన్నత స్థానంలో నిలబెట్టింది మల్కాజిగిరి ప్రజలేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి జరగకపోవటం వల్లే భూముల ధరలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Revanth Reddy Comments on Modi : సంక్షేమం గురించి చెప్పుకోవడానికి బీజేపీ వద్ద ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏమీలేకనే మతం గురించి మాట్లాడుతోందని విమర్శించారు. ఆకలి సూచీలో భారత్‌దేశం ఇప్పటికీ 111వ స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో ఆకలి చావులు తగ్గించడానికి మోదీ చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 5 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తానని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బలంగా ఉన్నచోట బీఆర్ఎస్ తన మద్దతు బీజేపీకి ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.