CM Revanth Reddy Delhi Tour :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సహా కాంగ్రెస్ కీలక నేతలు దిల్లీకి చేరారు. ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో వీరంతా పాల్గొననున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రేపు దిల్లీ నుంచే సింగపూర్, దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించడం సహా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై పారిశ్రామికవేత్తలతో సమావేశంకానున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ బృందం ఆస్ట్రేలియా వెళ్లి స్పోర్ట్స్ యూనివర్శిటీపై అధ్యయనం చేయనుంది.
మంత్రి వర్గ విస్తరణ :కాంగ్రెస్ కీలక నేతలందరూ దిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, ముఖ్యనేతలు రాజధానికి వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. సీఎం, పీసీసీ చీఫ్రే పు మధ్యాహ్నం వరకు దిల్లీలోనే ఉంటారు. ఏఐసీసీ అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.
సింగపూర్, దావోస్ పర్యటన : సీఎం రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం దిల్లీ నుంచి సింగపూర్ బయలుదేరతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బృందం రేపు రాత్రికి సింగపూర్ చేరుకోనుంది. ఈనెల 19 వరకు సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం బృందం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యానికి పలు సంస్థలతో ఒప్పందాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులపై పలు కంపెనీలతో చర్చించనుంది. సింగపూర్ నుంచి సీఎం బృందం స్విట్జర్లాండ్‌లోని దావోవ్‌కు వెళ్తుంది.
దావోస్‌లో ఈనెల 20 నుంచి 22 వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనడంతో పాటు అక్కడికి వచ్చే దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలపై చర్చించి రాష్ట్రంలో పెట్టుబడులు ఆహ్వానించనున్నారు. దావోస్‌లో గత జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు సందర్భంగా 40 వేల 232 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు దావోస్ వేదికగా 18 ప్రాజెక్టుల కోసం 14 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరగ్గా వాటిలో పదిహేడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పది ప్రాజెక్టులు పురోగతి ఉండగా మరో 7 ప్రారంభదశలో ఉన్నాయి. దావోస్ పర్యటనలో ఈసారి భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బయలుదేరుతోంది.
ఆస్ట్రేలియా పర్యటన :పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలోని బృందం రేపు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల 23వరకూ బ్రిస్బేన్‌లో పర్యటించనుంది. రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేసి ఒలింపిక్ విజేతలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల 'యంగ్ ఇండియా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్శిటీ' బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. వీలైనంత త్వరగా రాష్ట్రంలో డెడికేటెడ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌లోని క్వీన్స్‌ల్యాండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీని మహేశ్‌గౌడ్ బృందం సందర్శించనుంది. 1911లో ప్రారంభమైన ఈ వర్శిటీ ఆస్ట్రేలియాలో ఎందరినో మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దింది. ఇక్కడ చేసిన అధ్యయం ఆధారంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది.
మంత్రివర్గంలో వీరికేనా ఛాన్స్? - 11మందిలో ఆరుగురికే అవకాశం - telangana cabinet Expansion problem