CM Revanth Power Point Presentation on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం పరిశీలించింది. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను పరిశీలించిన అనంతరం, ప్రాజెక్టు పగుళ్ల, నీటి లీకేజీల గురించి సీఎం అధికారులనడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) వద్దే, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆనకట్ట కుంగుబాటు గురించి వివరించారు.
రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు నీరు అందలేదు : సీఎం రేవంత్ రెడ్డి
ఇన్‌ఛార్జి చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్టు నిర్మాణం తీరు, ఖర్చు, ఇతర వివరాలను సమగ్రంగా ముఖ్యమంత్రి, మంత్రులకు వివరించారు. అనంతరం, విజిలెన్స్ అధికారి రాజీవ్ రతన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్(PowerPoint presentation) ఇచ్చారు. మేడిగడ్డ కుంగుబాటు అనంతరం, కాంగ్రెస్ సర్కార్ విజిలెన్స్ విభాగం విచారణలో గుర్తించిన అంశాలు, లోపాలను వారు వివరించారు.
CM Revanth Fire On KCR : కాళేశ్వరం ప్రాజెక్టును పొరుగు రాష్ట్రాల సీఎంలను తీసుకువచ్చి చూపించిన కేసీఆర్, ఇవాళ తన ఎమ్మెల్యేలకు ఎందుకు చూపించటంలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలై పోయిందన్న ఆయన, తన అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతిని బీజేపీ సమర్థిస్తుందా అని సీఎం ప్రశ్నించారు.
"మేడిగడ్డ ప్రాజెక్టు దాదాపు 1.5 మీటర్ల లోతుకు కుంగిపోయింది. ఇది సాంకేతిక నిపుణులు చెబుతున్న మాట. కళ్లకు కట్టినట్లుగా పగుళ్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటిని కప్పిపుచ్చుకోవటానికి కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నాలు, ఈరోజు తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. సంస్థ నిర్మాణం పూర్తికాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలా లేదా? మీ వైఖరి ఏమిటి? బీజేపీ కూడా కేసీఆర్ అవినీతిని కాపాడటానికి ప్రయత్నం చేస్తారా లేకుంటే అవినీతిని నిలదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను."-రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి