CM Revanth Visits Karnataka Today :సీఎం రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట ప్రచారానికి వెళ్లాలని పార్టీ అధినాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచార బరిలోకి దిగారు. నాలుగు రోజుల క్రితం రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి కేరళలో పర్యటించారు. తాజాగా ఈరోజు సాయంత్రం రేవంత్‌రెడ్డి కర్ణాటకు వెళ్లనున్నారు. అక్కడి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.
ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్‌రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha
CM Revanth Reddy Campaign in Other States : తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్‌రెడ్డికి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్ భారీగా పెరిగింది. గత కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవలే వైజాగ్‌లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్రేజ్‌ను ఇతర రాష్రాల్లోనూ వాడుకోవాలని హస్తం పార్టీ నిర్ణయంలో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు.