CM Revanth Delhi Tour Updates :పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీచేయాలని ఇటీవల తీర్మానం చేసిన పీసీసీ, ఇదే అంశాన్ని కాంగ్రెస్ అగ్రనాయకురాలి దృష్టికి తీసుకెళ్లింది. దిల్లీ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పీసీసీ అధ్యక్షుడు,సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సోనియాతో ఆమె అధికారిక నివాసం 10-జన్‌పథ్‌లో సమావేశమయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని ఈ సందర్భంగా ఆమెను కోరారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందున రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీ నేతల విజ్ఞప్తిపై స్పందించిన సోనియా గాంధీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు.
CM Revanth Sonia Gandhi TS Lok Sabha 2024 :రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోనియా గాంధీకి (Sonia Gandhi) వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంపు హామీలు ఇప్పటికే అమలు చేస్తున్నట్లు వివరించారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేత, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీలను త్వరలో అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
8 నుంచి బడ్జెట్ సమావేశాలు - అసెంబ్లీ వేదికగా మరో 2 గ్యారంటీలు ప్రకటించనున్న సీఎం!
తెలంగాణలో కులగణనకు సన్నాహాలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి సోనియా గాంధీకి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో తొలిసారిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పథకాల అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సోనియాగాంధీ అభినందించారు.