ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసరాలు- వరద సాయంపై సీఎం చంద్రబాబు సమీక్ష - CM Chandrababu review

CM Chandrababu review : వరద బాధితుల పునరావాసం, సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సాయం ప్రతి ఇంటికీ అందాలని అధికారులకు స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించనున్నట్లు సీఎం ప్రకటించారు.

cm_chandrababu_review
cm_chandrababu_review (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 12:40 PM IST

CM Chandrababu review :వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని సూచించారు. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? - బ్యాంక్​ ఖాతాల నంబర్లు ఇవే - Donate For Flood Victims

వరద తగ్గినందున ఆహారం డోర్ టు డోర్ వెళ్లే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, కేజీ చక్కెర అందించాలని సీఎం ఆదేశించారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని సీఎం వివరించారు. ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలని తేల్చిచెప్పారు. అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయడంతో పాటు శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయలన్నారు. వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న చంద్రబాబు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటంతో పాటు వారికి ఏ మెడిసిన్ కావాలన్నా అందించాలన్నారు. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం 2.3 లక్షల అల్పాహారం ప్యాకెట్లు పంపించామని మంత్రులు సీఎంకు వివరించారు. 4.5 లక్షల మందికి మధ్యాహ్నం, సాయంత్రానికి భోజనం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 2.5 లక్షల పాల ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లతో పాటు 117 ట్యాంకర్లను పంపించామని, మరో 6 లక్షల నీళ్ల బాటిళ్లు సిద్ధంగా ఉంచిన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయని, వాటితో పారిశుధ్య పనులు మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం-మానవత్వం చాటుకుంటున్న దాతలు - Chiranjeevi Donate One Crore

ఆపత్కాలంలో ఆదుకున్న ట్యూబ్‌లు - పంపిణీ చేసిన స్వచ్ఛంద సంస్థలు - Lorry Tubes to Save Lives

ABOUT THE AUTHOR

...view details