CM Chandrababu Review on Tourism Department: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారును ఆదేశించారు. సచివాలయంలో పర్యాటక శాఖపై సీఎం సమీక్ష చేపట్టారు. సమావేశానికి ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్, అధికారులు హాజరయ్యారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా వివిధ ప్రణాళికలపై సీఎం చర్చించారు. వివిధ ప్రాంతాల్లో హోటల్ గదుల నిర్మాణం, పీపీపీ ప్రాతిపదికన ప్రాజెక్టులు చేపట్టే అంశంపై సీఎం సమీక్షించారు. కేంద్ర పథకాలను సమన్వయం చేసుకుని రాష్ట్రంలో టూరిజం సర్క్యుట్లను ఏర్పాటు చేసే అంశంపై సీఎం చంద్రబాబు ఆదేశించారు.
పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధిరేటు ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ ప్రాజెక్టులు అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని ఎన్ఆర్ఐల భాగస్వామ్యంతో హోమ్ స్టేల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యాటకులకు మండువా లోగిళ్లు అందుబాటులోకి తేవాలని అలానే సీ ప్లేన్, హెలీ టూరిజం ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. తిరుపతి, విశాఖ, అమరావతి, శ్రీశైలం, రాజమహేంద్రవరంలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో కీలక పరిణామం - 35 మంది బెయిల్ పిటిషన్ల కొట్టివేత