CM Chandrababu Emotional : ఉద్యోగులకు వేతనాలు, వృద్ధులు, సామాజిక పింఛన్లు 1వ తేదీనే పంపిణీ చేయడంపై సీఎం చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజునే దాదాపు 98శాతం పింఛన్లు పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందని, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత తమ బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు.
గురువారం ఒక్క రోజునే రూ.2737 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి అందించడం విదితమే. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనగా, మంత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పండగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఒకటవ తేదీనే ఇంటి వద్ద 2737 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ ఎంతో సంతృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
అవ్వాతాత కళ్లల్లో ఆనందం- తొలిరోజే రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ - NTR Bharosa Pension Distribution
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు అందించామని వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత తమ బాధ్యత అని స్పష్టం చేశారు. పెరిగిన పింఛను ఆ పేదల జీవితాలకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగమని ప్రజలకు ఏ మంచి చెయ్యాలన్నా వారే కీలకమన్నారు. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందజేశామని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించామని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనేక సమస్యలు ఉన్నా రూ.5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1వ తేదీనే చెల్లించామని తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకమని ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు వారి సంక్షేమం చూసే, గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. కలిసి కష్టపడదాం.. రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని పిలుపునిచ్చారు.
పండగలా పింఛన్ల పంపిణీ - మొదటి రోజే అందరికీ అందించేలా చర్యలు - Pension Distribution in AP
'రాళ్ల సీమను రత్నాల సీమగా చేసే బాధ్యత మాది': మడకశిరలో సీఎం చంద్రబాబు - CHANDRABABU COMMENTS AT MADAKASIRA