CM Chandrababu Discussion With Ministers: జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బియ్యం, భూ దురాక్రమణ మాఫీయా ప్రభుత్వానికి సవాల్ విసురుతోందన్న సీఎం, అన్నింటినీ అరికాడతామని హెచ్చరించారు. కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణపై సీఐడీ విచారణ జరిపిద్దామని మంత్రులతో అన్నారు. 5 ఏళ్ల అమరావతి విధ్వంసం వల్ల 33.9 శాతం ప్రభుత్వంపై ఆదనవు భారం పడిందని ఆయన మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశం అనంతరం వివిధ అంశాలపై సీఎం, మంత్రులు కీలకంగా చర్చించారు.
ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదు: జల్ జీవన్ మిషన్ డీపీర్ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారుల్ని సీఎం నిలదీశారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవట్లేదని దిల్లీలోనూ టాక్ ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. బ్యూరోక్రసీ ఆలస్యం వల్లే మంచి పథకం సద్వినియోగం కావట్లేదని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ మోడ్‌లో పనిచేస్తే జలజీవన్ పథకం అద్భుత ఫలితాలిస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు. జేజేఎం (Jal Jeevan Mission) ప్రతి ఒక్కరికీ చేరే అతి పెద్ద ప్రాజెక్టని ఆయన చెప్పారు. పథకాలు సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం తేల్చిచెప్పారు.
నిర్మించని గృహాలన్నీ రద్దు - ఏపీ మారిటైమ్ పాలసీకి కేబినెట్ ఆమోదం
ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలి: పులివెందుల, ఉద్దానం, డోన్‌లో తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించారు. మంత్రుల విజిబిలిటీ పెరగాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్12న ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తవుతున్నందున ఎవరేం చేశారో సమగ్ర నివేదిక ఇస్తే స్ట్రీమ్ లైన్ చేస్తానని స్పష్టం చేశారు. లిక్కర్, ఇసుక మాఫియాలను అరికట్టామని, మిగిలిన చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రేషన్ మాఫియాను అరికడుతున్నామన్న సీఎం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా రెవెన్యూ సమస్యలూ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం జరపాలని నిర్ణయించారు. ఐటీ, టెక్స్‌టైల్, మారీటైమ్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో పలు సవరణలకు మంత్రివర్గం ఆమోదించింది.
ఆస్తులు లాక్కోవడం వైఎస్సార్సీపీ హయాంలో ట్రెండ్:కాకినాడ పోర్ట్, కాకినాడ సెజ్‌లను బలవంతంగా లాక్కునారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆస్తులను లాగసుకోవడం వైఎస్సార్సీపీ హయాంలో కొత్త ట్రెండ్ అయ్యిందని, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను బాగా డ్యామేజ్ చేశారని విమర్శించారు. తప్పులు చేసిన జగన్ ప్రభుత్వంపై అరుస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
దక్షిణాదిన లేని అవకాశాలను సద్వినియోగం చేయాలి: అమరావతి పనులు వేగవంతం చేసుకుంటూ ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రానికి ఉన్న సుదూర తీరప్రాంతాన్ని పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించాలని నిర్ణయించారు. షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్, షిప్ రిపైర్ వంటివి మనవద్ద లేవన్న చంద్రబాబు, దక్షిణ భారతదేశంలో లేని ఈ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటే అపార అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. జల రవాణాను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ఖర్చు కూడా తగ్గుతుందని గుర్తు చేశారు.
విచారణ వేగవంతం - రేషన్ బియ్యం అక్రమార్కులకు ముచ్చెమటలు