Class War in YCP Across the State:శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలో వ్యవసాయ క్షేత్రంలో ఆరు మండలాల సంబంధించిన వైసీపీ అసమ్మతి నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా అసమ్మతి నాయకులు మాట్లాడుతూ పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఏ సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వైసీపీ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఆరు మండలాల అసమ్మతి నాయకులతో చెయ్యి కలిపి పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకి ఏదైనా సమస్య విన్నవిస్తే పీఎనీ కలవమంటారని తీరా అక్కడికి వెళ్లాక ఎమ్మెల్యే పీఏ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి గుణపాఠం చెబుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అసమ్మతి నాయకులు పాల్గొన్నారు.
వైసీపీలో ఆగని ఇన్ఛార్జీల మార్పు - సీఎంవోకు క్యూ కడుతున్న నేతలు
YCP MLA Tippeswamy is Unhappy:అదే జిల్లాలోని మడకశిర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మడకశిర వైసీపీ నాయకుడు అశోక్ కుమార్‌పై ఎమ్మెల్యే తిప్పేస్వామి అసహనం తెలిపారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా భేటీలు పెడుతున్నారని తిప్పేస్వామి తెలిపారు. ఎస్సీ ఎమ్మెల్యే అయినందున అవమానిస్తున్నారని తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు లేకుండా భేటీ నిర్వహించారని తిప్పేస్వామి ఆరోపించారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి వైసీపీ నాయకుడు అశోక్ కుమార్‌కు లేఖ పంపగా ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.