ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

అందరి చూపు చిలకలూరిపేటవైపే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సభకు భారీ ఏర్పాట్లు

Chilakaluripet Modi Sabha Arrangements : చిలకలూరిపేట సభ ఏపీ ఎన్నికల యుద్ధ క్షేత్రంలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ నెల 17న ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఖరారు కాగా, టీడీపీ, జనసేన, బీజేపీ నతలు సభ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. సభ విజయవంతానికి ఏర్పాటైన 13 కమిటీలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి. మూడు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న తొలి ఎన్నికల బహిరంగ సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు.

chilakaluripet_modi_sabha_arrangements
chilakaluripet_modi_sabha_arrangements

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 3:48 PM IST

Chilakaluripet Modi Sabha Arrangements : తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తొలిసభను సమన్వయంతో విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమరశంఖం పూరించే ఈ సభ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం 9:32 గంటలకు సభ ఏర్పాట్లకు భూమిపూజ చేయాలని నిర్ణయించారు. లోకేశ్ నేతృత్వంలో చిలకలూరిపేట బహిరంగ సభ నిర్వహణ కమిటీ సమావేశం ముగిసింది. చిలకలూరిపేట సభ ద్వారా జగన్ పతనానికి నాంది పలుకుతామని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఆర్టీసీతో సమన్వయం చేసుకుని డిపోల వారీగా బస్సులు అడుగుతామని తెలిపారు. సమయం తక్కువే ఉన్నా మెరుగైన ఏర్పాట్లు చేస్తామని బీజేపీ ప్రతినిధి సాదినేని యామినీ శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని సత్తా చాటుతామన్నారు. 2014 నాటి రాజకీయ ఎన్నికల ముఖ చిత్రం ఈ నెల 17న తిరిగి ఆవిష్కృతం కానుందని జనసేన ప్రతినిధి హరి (Janasena spokesperson Hari) అన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తకుండా 3పార్టీలు సమన్వయంతో ముందుకెళ్తాయని హరి తెలిపారు.

17న చిలకలూరిపేటలో 3 పార్టీల తొలి బహిరంగ సభ - పాల్గొననున్న ప్రధాని మోదీ

ఈ నెల 17న నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనను ప్రధాన మంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఈ మేర తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Telugu Desam leader Chandrababu)కు ప్రధాని కార్యాలయం సమాచారం పంపింది. 17న చిలకలూరిపేటలో తలపెట్టిన తెలుగుదేశం-బీజేపీ-జనసేన ఉమ్మడి సభకు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. సభ ద్వారా ఒకే వేదికపైకి నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రానున్నారు. మూడు పార్టీలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని గన్నవరం తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. సభ నిర్వహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తొలి బహిరంగ సభపై లోకేశ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు నివాసంలో లోకేశ్ నిర్వహిస్తున్న సమీక్షకు 3పార్టీల కమిటీ సభ్యులు హాజరయ్యారు. లోకేశ్ నేతృత్వంలో సభ నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

కూటమిని ఆశీర్వదించండి - సీట్ల సంఖ్య కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం: చంద్రబాబు, పవన్‌

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి (Telugu Desam, Jana Sena, BJP alliance) తొలి బహిరంగ సభపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో కమిటీ సభ్యులతో సభ నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లోకేశ్ నేతృత్వంలో సభ నిర్వహణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణకు 13 కమిటీలను నియమించారు. మూడు పార్టీల్లోని నేతలతో కమిటీలు ఏర్పాటు చేశారు. మూడు పార్టీలు తొలి ఎన్నికల బహిరంగ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లలో ప్రధానమైన సమన్వయ కమిటీలో నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, జీవీ ఆంజనేయులు ఉన్నారు. సమన్వయ కమిటీలో జన సేన ప్రతినిధులు గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, చిల్లపల్లి శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధులు పాతూరి నాగభూషణం, సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి ఉన్నారు. బీజేపీతో తెలుగుదేశం, జనసేన పొత్తు కుదిరాక ఆర్టీసీ దిగొచ్చింది. చిలకలూరిపేట సభకు బస్సులు కేటాయించేందుకు అంగీకారం తెలిపింది.

సీట్లు ఖరారు - జనసేన, బీజేపీకి 8 ఎంపీ, 31 అసెంబ్లీ సీట్లు

ABOUT THE AUTHOR

...view details