ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

విదేశీ పర్యటన ముగించుకున్న జగన్​- గన్నవరంలో పార్టీ శ్రేణుల స్వాగతం - CM Jagan tour - CM JAGAN TOUR

CM Jagan tour : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబసమేతంగా ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు

cm_jagan_tour
cm_jagan_tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 12:07 PM IST

CM Jagan tour : ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబసమేతంగా ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా గత నెల 17న విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ కు బయల్దేరగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు వీడ్కోలు పలికారు. ఏపీ సీఎం జగన్ మే నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు నుంచి అనుమతి పొందారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో 17 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ కు 2013లో బెయిల్ మంజూరు సందర్భంగా దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు షరతు విధించజం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details