CM Jagan attack case : ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? సంబంధిత పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే శాంతి, భద్రతల అంశం పోలీసుల పరిధిలోనిది కాబట్టి. కానీ ఎక్కడైనా వీఆర్వో వద్దకు వెళ్లి సమాచారం పంచుకోవడం చూశామా? అక్కడ ఆ వ్యక్తి స్టేట్‌మెంట్‌ను వీఆర్వో నమోదు చేసి ఆ తర్వాత దీనిని పోలీసులకు సమాచారం ఇవ్వడం వింతగా లేదూ? ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనో లేక స్టేషన్‌కు చాలా దూరంలో ఉండే ప్రాంతంలో జరిగింది కాదు. సాక్షాత్తు పరిపాలన కేంద్రమైన విజయవాడ నగరంలో. అది కూడా స్టేషన్‌కు 1.5 కి.మీ దూరంలో ఉండే వ్యక్తి ఇలా చేశాడంటే నమ్మశక్యంగా ఉందా? కానీ, మన ఘనమైన నగర పోలీసులు దీనిని నిజం చేసి చూపించారు. గులకరాయి కేసులో నగర పోలీసులు కోర్టుకు సమర్పించిన కేస్ డైరీ రెండో భాగంలోని ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతోంది. ఆదేంటో.. మీరే చూడండి.
మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై 13న రాత్రి.. విజయవాడ శివారు సింగ్‌నగర్‌లోని డాబాకొట్ల రోడ్డులో గుంపులో నుంచి వచ్చిన రాయి తగిలి స్వల్ప గాయమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో అంతా చీకటిగా ఉంది. పోలీసులు నిందితుడిగా చూపిన సతీష్, రాయి విసిరిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో కేసు తేలిపోకుండా ఉండేందుకు నానా తిప్పలు పడినట్లు కనిపిస్తోంది. 16వ తేదీన సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కోడి కత్తి కేసు బాహుబలి పార్ట్ 1 అయితే, రాయి దాడి పార్ట్ 2: లాయర్ సలీం - Advocate Abdul Saleem
వీరిలో మేజర్ అయిన సతీష్‌ను ఏ1గా చూపించారు. మిగిలిన వారు మైనర్లు. వీరిలో ఇద్దరిని సాక్షులుగా చేర్చారు. వీరి నుంచి తీసుకున్న స్టేట్మెంట్లలో జగన్‌పై రాయితో దాడి చేస్తే ఏ1 సతీష్‌కు టీడీపీ నేత దుర్గారావు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఆశ చూపించినట్లు చెప్పారు. తాము వద్దని వారించినా ముఖ్యమంత్రిపైకి ఏ1 రాయి విసిరాడని పేర్కొన్నారు. తమకు సతీష్ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పినట్లు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. తొమ్మిదో సాక్షిగా ఉన్న బాలుడు.. సతీష్ రాయి వేసిన సంగతిని తన తండ్రి ఎల్లయ్యకు చెప్పాడంట. ఇది విని భయపడిన ఎల్లయ్య, వెంటనే నార్త్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. జగన్‌పై ఏ1 రాయి విసిరాడని చెప్పగానే ఆమె తండ్రీకొడుకుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసి, వాటిని చర్య నిమిత్తం పోలీసులకు పంపించినట్లు కోర్టుకు సమర్పించిన స్టేట్మెంట్లలో ఉంది. తమకు అనుకూలంగా పోలీసులు రాయించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.