ETV Bharat / state

పద్ధతి లేని సాగు లెక్కలు - కాలం చెల్లిన కొనుగోలు విధానాలే రైతన్నకు శాపం! - MIRCHI FARMERS OVER PRICE FALLS

రాష్ట్రంలో 2016 నుంచి ఈ-క్రాప్‌ అమలు-దేశవ్యాప్తంగానూ ఇదే విధానం అమలు,ఈ క్రాప్‌తో వాస్తవ సాగుదారులకు సాయం.

mirchi_farmers_worried_over_price_falls
mirchi_farmers_worried_over_price_falls (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 8:12 AM IST

Red Mirchi Farmers Worried Over Price Falls : మిర్చి ధరల పతనంతో రైతులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు కల్పించేందుకు కేంద్రం, రాష్ట్రం ముందుకొచ్చాయి. అయితే ఈ-క్రాప్‌ ఆధారంగా సాయం చేస్తేనే మిరప రైతుకు న్యాయం జరుగుతుంది. రైతుల ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ అవుతుంది. క్వింటాల్‌కు 3 వేలు ఇస్తేనే భరోసా కలుగుతుంది. దీనివల్ల కేంద్ర రాష్ట్రాలపై 2,512 కోట్ల భారం పడుతుంది.

కాలం చెల్లిన విధానాలు: రైతులకు సాయం అందించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ దశాబ్ద కాలం నాటి మార్కెట్‌ లెక్కలనే వల్లెవేస్తోంది. అక్కడికొచ్చి అమ్ముకుంటేనే రైతుకు సాయం అంటోంది. ఈ-క్రాప్‌తో ఏ రైతు ఎంత పండించారు? ఎంత అమ్ముకున్నారనే వివరాలు సేకరించి ఆదుకునే అవకాశాలను విస్మరిస్తోంది. పద్ధతి లేని సాగు లెక్కలు, కాలం చెల్లిన కొనుగోలు విధానాలే మిరప రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో 2016 నుంచి ఈ-క్రాప్‌ అమలవుతోంది. దేశవ్యాప్తంగానూ దీన్ని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగా వాస్తవ సాగుదారులకు సాయం చెల్లించవచ్చు. ఇందులో ఎలాంటి సమస్యలు ఉండవు.

4.18 లక్షల ఎకరాల్లో సాగు: రైతులు, కౌలు రైతులకూ సాయం అందుతుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీలో 2,17,490 మంది రైతులు 4.18 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు. ఇదంతా ఈ-క్రాప్‌లో నమోదైంది. వాస్తవ సాగుదారుల పేర్లను నమోదు చేశారు. పంట నష్టానికి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తోంది. మిరప పంటకు సంబంధించిన సాయాన్ని కూడా సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున నిర్ణయించి అది ఇస్తే రైతులు, కౌలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి ప్రకారం క్వింటాల్‌కు 3 వేలు చెల్లిస్తే ఎకరాకు 60వేలు దక్కుతాయి. దీంతో రైతులకు కొంతమేర భరోసా లభిస్తుంది. మొత్తంగా కేంద్ర, రాష్ట్రాలు 2,512 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది.

అలా మోసం చేస్తే: మిరప ధర క్వింటాల్‌కు 11,781కి తగ్గితే మార్కెట్‌ జోక్యం కింద వ్యత్యాస ధర చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది. అంటే రైతు మార్కెట్లో 10వేలకే అమ్ముకుంటే తేడా 1,781 మాత్రమే. ఈ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం చెరిసగం చొప్పున రైతుకు చెల్లిస్తాయి. సన్నరకాలు, నాణ్యమైన మిరప అయితే క్వింటాల్‌ 12వేలకు పైనే ఉంది. ఎగుమతులతో మరింత పెరిగే అవకాశమూ ఉంది. అయితే కేంద్ర, రాష్ట్రాలు ఎలాగూ రైతుకు బోనస్‌ రూపంలో సొమ్ము చెల్లిస్తున్నాయి కాబట్టి మనం ఎంత తక్కువకు కొన్నా అడిగే వారుండరనే ధైర్యం వ్యాపారుల్లో వస్తుంది.

గతేడాది పంటకు గిట్టుబాటు ధర లేదు - ఉన్న పంటపై బొబ్బర, నల్లి తెగుళ్ల దాడి

అలా అయితే నష్టమే: దీంతో ధరలో కోత పెట్టి క్వింటాల్‌ రూ. 8వేలు, రూ. 9వేలు చొప్పునే కొంటారు. అప్పుడు రైతులు మరింత నష్టపోవాల్సి వస్తుంది. 2017-18 సంవత్సరంలో ఇదే జరిగింది. వ్యాపారులు ధరలో కోత పెట్టడంతో మిరప రైతులు అటు మార్కెట్‌ ధర లేక, ఇటు ప్రభుత్వ సాయం చాలక నష్టపోయారు. అంతకు ముందు పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్రాలు సాయం ప్రకటించినప్పుడూ బోనస్‌ వస్తోందంటూ వ్యాపారులు ధరను తగ్గించారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురవ్వొచ్చు.

వారికే సాయం: మిరప రైతుల్లో కొంతమంది గ్రామాల్లోనే పంటను విక్రయిస్తారు. దళారులు వారి దగ్గర నుంచి పంటను కొని మార్కెట్‌కు తెచ్చి అమ్ముకుంటారు. మార్కెట్లో అమ్ముకున్న వారికే సాయం అంటే నిజంగా పండించిన రైతులు నష్టపోతారు. దళారులకే సాయం అందుతుంది. ఈ-క్రాప్‌లో నమోదై, మార్కెట్లో అమ్ముకున్న వారికే సాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నా ఇప్పటికే గ్రామాల్లో మిరప అమ్ముకున్న రైతులకు ఎలాంటి సాయమూ అందదు. వారు మార్కెట్‌కు వచ్చి అమ్ముకోలేరు. తక్కువ ధరకే అమ్ముకున్నారు. మార్కెట్లో మిరప అమ్ముకున్న రైతులకే సాయం అందిస్తామంటే ఆ రైతులు ఎవరనేది చెప్పాల్సింది కమీషన్‌ వ్యాపారులే.

అంటే వారు తమకు అనుకూలమైన రైతుల పేర్లనే నమోదు చేసే అవకాశం ఉంది. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల పేర్లు తీసుకుని వారి పేర్లతో అమ్మకాలు జరిగినట్లు చూపిస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. ప్రస్తుతం ఈ-క్రాప్‌ ఆధారంగా జరుగుతున్న పత్తి కొనుగోలు దీనికి ఒక ఉదాహరణ. కొందరు వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి పత్తి కొంటున్నారు. ఈ-క్రాప్‌లో నమోదైన పత్తి రైతుల పేర్లు తీసుకుని వారి పేరుతో అమ్మినట్లు సీసీఐ కేంద్రాల్లో నమోదు చేయిస్తున్నారు. నగదు రైతుల ఖాతాల్లో జమ కాగానే వారు బదిలీ చేయించుకుంటున్నారు. ఇందుకు క్వింటాల్‌కు 200 చొప్పున చెల్లిస్తున్నారు. మిరప కొనుగోలులోనూ ఇదే పునరావృతం అవుతుంది. వీటన్నింటినీ కేంద్ర రాష్ట్రాలు పరిశీలించాలి.

మిర్చి ధర ఎందుకు తగ్గింది? విలవిలలాడుతున్న రైతన్నలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.