CM Chandrababu Delhi Tour : ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తినకు వెళ్లారు. రాష్ట్ర ప్రయోజనాలు, పెండింగ్ ప్రాజెక్టులు, ఆర్థిక ప్రోత్సాహకాలపై సీఎం కేంద్ర పెద్దలను కలిసి విన్నవించనున్నట్లు సమాచారం. ఏపీకి పారిశ్రామిక రాయితీలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం, రాష్ట్రంలో అత్యవసరంగా చేపట్టాల్సిన రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Chandrababu Sensational Comments on Delhi Tour: "కొన్ని విషయాలు రహస్యం ఉంటేనే మంచిది" అని సీఎం చంద్రబాబు తన దిల్లీ పర్యటనపై ఆరా తీసిన మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సమావేశమైన చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలపై పలు సూచనలు చేశారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని, ప్రజల్లో అభాసుపాలు కావొద్దని ఎమ్మెల్యేలకు సైతం సందేశమిచ్చారు. దిల్లీ పర్యటన ఉద్దేశించి మాట్లాడుతూ "రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయ్.. అందుకే దిల్లీ వెళ్తున్నా.. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది" అని చెప్తూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కోసమే దిల్లీ వెళ్తున్నానని, అన్ని విషయాలు బయటకు చెప్పలేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
"దటీజ్ చంద్రబాబు" హాట్‌టాపిక్‌గా దిల్లీ తొలి పర్యటన- నాడు జగన్ 29సార్లు - CBN Delhi Tour
కేంద్ర పథకాలు, ప్రాజెక్టుల నిధులను సద్వినియోగం చేసుకోవడంపై చంద్రబాబు దృష్టి సారించారు. అదే సమయంలో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆహ్వానంపై అధికారులతో సమీక్షలో తరచూ ఆరా తీస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు పూర్తిగా వివరించేలా నివేదికలు ఉండాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు.