ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయి: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING - CHANDRABABU PRAJA GALAM MEETING

Chandrababu Prajagalam Public Meeting: రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే కూటమి కట్టామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి, పిల్ల కాంగ్రెస్‌ కొత్త కుట్రకు తెరలేపాయని చంద్రబాబు ఆరోపించారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలి, ప్రజల నెత్తిన ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు.

Chandrababu_Prajagalam_Public_Meeting
Chandrababu_Prajagalam_Public_Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 9:16 PM IST

Chandrababu Prajagalam Public Meeting: కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే అని చంద్రబాబు ధీమా చేశారు. అందుకే ఆ పార్టీతో కలిశామని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది తమ కోసం కాదని రాష్ట్రం కోసం అని స్పష్టం చేశారు. ఎన్డీఏకు పడే ఓట్లు చీల్చాలని తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయని మండిపడ్డారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

రావణాసురుడిని అంతం చేసేందుకే: రాముడు దేవుడు అయినప్పటికి వానరులతో కలిసి పోరాడారన్న చంద్రబాబు, రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే బీజేపీతో కలిశామని తెలిపారు. రావణాసురుడిని చంపేందుకు వానరసైన్యమంతా కలిసిందని అన్నారు. ఈ దోపిడీ దొంగలు కృష్ణా నదిలోనే రోడ్డు వేశారని ధ్వజమెత్తారు.

తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయి: చంద్రబాబు

ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయన్న చంద్రబాబు, గత ఐదేళ్లలో ముస్లింలపై అనేక దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలు, బాలికలను వైసీపీ నేతలు వేధించారని దుయ్యబట్టారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అలాగే ఉంటాయని తాను హామీ ఇస్తున్నానన్నారు.

కౌరవ మూకను మే 13న అన్ని వర్గాలు ఏకమై తరిమికొట్టాలి : చంద్రబాబు - YCP Leader Misbehavior of Women

గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలి: 2014 నుంచి 2019 వరకు బీజేపీతో టీడీపీ కలిసే ఉందని తెలిపారు. 2014- 2019 మధ్య ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లింల రక్షణకు తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలని తెలిపారు. గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలని అన్నారు. ఏపీ నుంచి ఎంతోమంది అమెరికాకు వెళ్లారని, తెలుగు వాళ్లు అమెరికాకు వెళ్లేలా ఫౌండేషన్‌ వేసింది ఎవరు అని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టును తానే 72 శాతం పూర్తి చేశానని తెలిపారు. ఈ ఐదేళ్లలో పోలవరం మిగతా పనులు ఏమాత్రం చేయలేదన్న చంద్రబాబు, యువత కంటే తన ఆలోచనలు 20 ఏళ్లు ముందుంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆనాడు నేను చేసిన కృషితో ఇవాళ హైదరాబాద్‌ నంబర్ వన్‌గా ఉందన్న చంద్రబాబు, టీడీపీ అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ గెలిస్తే పెదకూరపాడులో కూడా ఐటీ పార్కు వస్తుందని తెలిపారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో 33 మంది చనిపోయారు - ఈసీకి చంద్రబాబు లేఖ - Chandrababu writes to EC

మీ జీవితాలు మారతాయి: ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ముస్లింలకు న్యాయం చేసేందుకు రంజాన్ తోఫా తీసుకువచ్చానని, ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇచ్చానని అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీఏను గెలిపించాలని కోరారు. టీడీపీ అమలు చేసే సూపర్‌ సిక్స్‌తో మీ జీవితాలు మారతాయని, సంపద సృష్టించి అందరికీ పంచే పార్టీ టీడీపీ అని తెలిపారు. కొరియా నుంచి ఏపీకి కియా సంస్థను తీసుకువచ్చానని, అమరరాజా కంపెనీని వైసీపీ వేధిస్తే వాళ్లు తెలంగాణకు వెళ్లిపోయారని గుర్తు చేశారు. అమరరాజా కంపెనీ వెళ్లిపోయి తెలంగాణలో పరిశ్రమ పెట్టిందని అన్నారు.

తల్లికి వందనం పథకం కింద మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న, కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని అన్నారు. జగన్‌ రూ.10 ఇచ్చి వంద రూపాయలు తీసుకుంటున్నారన్న చంద్రబాబు, పింఛన్ల పంపిణీలో శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతమంది సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వలేరా అని ప్రశ్నించిన చంద్రబాబు, ఎన్డీఏ గెలిస్తే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని తెలిపారు.

తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం:తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయన్న చంద్రబాబు, కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పిందని తెలిపారు. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. పిల్ల కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి కాంగ్రెస్‌ నాటకం ఆడుతోందని చంద్రబాబు విమర్శించారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలని, ఎన్డీఏకు పడే ఓట్లు చీల్చాలని నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రం దివాలా తీసినా బాగు పడింది ఒక్క జగన్ మాత్రమే: చంద్రబాబు - Prajagalam Public Meeting

ABOUT THE AUTHOR

...view details