ETV Bharat / state

ఆ గ్రామాలు ఎలా మాయమయ్యాయి- హైకోర్టు ఆగ్రహం - HC ABOUT REMOVAL OF VILLAGES

792కు 292 మాత్రమే ఉండటం ఏమిటి?షెడ్యూల్డ్‌ ప్రాంతాలను ఏ అధికారంతో కుదిస్తున్నారు? కేంద్ర గిరిజన సంక్షేమశాఖను ప్రశ్నించిన హైకోర్టు

high_court_strongly_condemned_removal_of_hundreds_of_villages_from_schedule_areas
high_court_strongly_condemned_removal_of_hundreds_of_villages_from_schedule_areas (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2025, 9:37 AM IST

High Court Strongly Condemned Removal of Hundreds of Villages from Scheduled Areas : ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో ఉన్న షెడ్యూల్డ్‌ ప్రాంతాల నుంచి వందల గ్రామాలను తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. షెడ్యూల్డ్‌ ఏరియాలను ఎందుకు ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించింది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 292 కి తగ్గిందని, మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయని ప్రశ్నించింది.

ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేయాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించింది. విఫలమైతే తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తమముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

గిరిజన హక్కుల్ని రక్షించాలంటూ : విజయనగరం జిల్లాలోని జియ్యమ్మవలస, కురుపాం, పార్వతీపురం తదితర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల షెడ్యూల్డ్‌ ఏరియా హద్దులను గిరిజనేతరులకు ప్రయోజనం కలిగేలా మారుస్తున్నారంటూ ఇంటిగ్రేటెడ్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అధ్యక్షుడు వెంకటశివరాం 2023లో హైకోర్టు (High Court)లో పిల్‌ వేశారు. షెడ్యూల్డ్‌ ఏరియా హద్దులను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరిచి గిరిజన హక్కులను రక్షించాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్యాంసుందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ గిరిజనేతరులకు లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు.

20 ఏళ్లుగా ఎదురుచూపులు - ఆ రెండు గ్రామాల కల సాకారమయ్యేనా!

సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం మేరకు షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలున్నాయని, ప్రస్తుతం ఆ సంఖ్య 292కి చేరిందన్నారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యవహారంపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎస్‌జీ) పొన్నారావును ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ గిరిజన గ్రామాల పూర్తి వివరాలు కావాలంటూ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ఆ వివరాలు అందగానే కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు.

పేరుకే ఆ ఊళ్లు - జనాలు మాత్రం ఉండరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.