తెలంగాణ

telangana

ETV Bharat / politics

దిల్లీకి చంద్రబాబు, పవన్- ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో పాల్గొన్న నేతలు - Chandrababu Delhi Tour - CHANDRABABU DELHI TOUR

Chandrababu Naidu Visit Delhi : ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడివిడిగా దిల్లీ వెళ్లారు. ఎన్డీయే లో ఉన్నామని స్పష్టం చేసిన ఇరువురు నేతలు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

Chandrababu Delhi Tour
Chandrababu Delhi Tour (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 2:02 PM IST

Updated : Jun 5, 2024, 5:14 PM IST

Chandrababu Delhi Tour: ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. ఎన్డీఏలో ఉన్నామని స్పష్టం చేసి దిల్లీ బయలుదేరిన చంద్రబాబు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అమిత్​ షా, రాజ్​నాథ్​, గడ్కరీతో పాటు నీతీశ్‌కుమార్‌, పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాల భేటీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు చర్చించారు.

చంద్రబాబు దిల్లీ పర్యటన నేపథ్యంలో కాన్వాయ్‌కు పోలీసులు గ్రీన్ ఛానల్ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయగా ఇవాళ ఉదయం ఆయన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో విమానాశ్రయం చేరుకున్న ఆయన ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరి వెళ్లారు. సమావేశం అనంతరం తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా పార్టీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

Janasena chief Pawan Kalyan Delhi Tour: మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దిల్లీ బయల్దేరి వెళ్లారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుతో కలిసి పవన్‌ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం మంగళగిరి నుంచి రోడ్డు మార్గంలో కుటుంబ సమేతంగా విజయవాడ విమానాశ్రయం వద్దకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ పయనమయ్యారు.

బాస్ ఈజ్ బ్యాక్ - రాజకీయ చతురతతో మళ్లీ అధికారంలోకి చంద్రబాబు - Chandrababu Naidu Super Comeback

Last Updated : Jun 5, 2024, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details