ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

మా పాలన స్వర్ణయుగం- వైసీపీ పాలన రాతియుగం: చంద్రబాబు - Chandrababu Fire on CM Jagan - CHANDRABABU FIRE ON CM JAGAN

Chandrababu Fires on CM Jagan in Prajagalam Sabha: కూటమి వస్తే అభివృద్ధి, వైసీపీ వస్తే అరాచకమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టోను భగవద్గిత, బైబిల్‌, ఖురాన్‌తో పోల్చిన జగన్‌ మద్య నిషేధం చేయకుండానే మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభ చంద్రబాబు ప్రసంగానికి ప్రజల్లో విశేష స్పందన వ్యక్తమైంది.

chandrababu_on_jagan
chandrababu_on_jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 9:20 PM IST

Chandrababu Fires on CM Jagan in Prajagalam Sabha:నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. మేనిఫెస్టోను భగవద్గిత, బైబిల్‌, ఖురాన్‌తో పోల్చిన జగన్‌ మద్య నిషేధం చేయకుండానే మళ్లీ ఓట్లు అడుగుతున్నారని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో దుయ్యబట్టారు. ఆత్మకూరు సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక్కడ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తనని వచ్చే ఎన్నికల్లో మీ జీవితాలు మార్చే బటన్ నొక్కండని ప్రజలకు సూచించారు.

'మాకేం తెలుసు ఈ మాండేటరీ' - వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లలో తప్పుల కుప్పలు - Complaints on YSRCP Nominations

వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్‌ అని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని జగన్‌ అన్నారు కాని ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు చేశారా అని ప్రశ్నించారు. స్వార్థం కోసం ఆడవాళ్ల మంగళసూత్రాలు తెంచేసిన వ్యక్తి జగన్‌ అని దుయ్యబట్టారు. ఇవాళ జగన్‌ బ్యాండేజ్‌ తీశారు ఏ ఒక్కరికైనా గాయం కనపడిందా అని అడిగారు. గులకరాయితో హత్యాయత్నం చేశానని, కోడికత్తితో హత్యాయత్నం చేశానని నాపై నిందలు వేశారుని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాండేజ్‌ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్‌ అనుకున్నారని ఎద్దేవా చేశారు. అందరూ హేళన చేయడంతో జగన్‌ ఇవాళ బ్యాండేజ్‌ తీశారని అన్నారు.

నవనందుల నంద్యాల లోక్​సభ - వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు - Nandyala Lok Sabha Constituency

రాష్ట్రంలో దొంగలు పడ్డారు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ ఎన్నికలు మన భవిష్యత్తును మార్చబోతున్నాయని అన్నారు. ఎండలకు భయపడకుండా ప్రజాగళం సభల్లో పాల్గొంటున్నారని అన్నారు. కూటమి వస్తే అభివృద్ధి వైసీపీ వస్తే అరాచకమని మా పాలన స్వర్ణయుగం వైసీపీ పాలన రాతియుగమని చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే టీడీపీ మేనిఫెస్టో సూపర్‌ సక్సెస్‌ అని అన్నారు. సీఎం జగన్‌ తన పాలనలో రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని గోదావరిలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తానన్న జగన్‌ హామీ నెరవేరిందా అని ప్రశ్నించారు.

కర్నూలు​ లోక్​సభ బరిలో బీసీ అభ్యర్థులు - రసవత్తరంగా పోరు - kurnool loksabha

రాష్ట్రంలో ఉత్తరకొరియా పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైసీపీ మేనిఫెస్టోలో ఉందా లేదా అని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే తొలిసంతకం డీఎస్సీపైనే అని హామీ ఇచ్చారు. జగన్‌ నవరత్నాలు నవమోసాలుగా తయారయ్యాయని అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ఏటా రూ.15 వేలు, ఏటా ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు, డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామి చంద్రబాబు చెప్పారు. సీఎం జగన్‌ రూ.10 ఇచ్చి రూ.వెయ్యి దోచేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

మా పాలన స్వర్ణయుగం వైసీపీ పాలన రాతియుగం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details