CEO Meena on MLA Pinnelli Ramakrishna Arrest:మాచర్ల నియోజకవర్గంలోనిపాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేసేందుకు 8 పోలీసు బృందాలు పని చేస్తున్నాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (CEO Mukesh Kumar Meena) తెలిపారు. ఈ ఘటనపై సరైన సమాచారం ఇవ్వనందుకు ఆ సమయంలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయాలని ఆదేశాలిచ్చినట్లు మీనా తెలిపారు. ఈ క్రమంలో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ, డీఎస్పీలతో 8 పోలీసు బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు.
మాటువేసి చెరువులోకి తోసి- మహిళల మృతి కేసులో వీడిన మిస్టరీ - Three Womens Murder Case
మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తల్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లటం ఇప్పుడు మంచిది కాదని అక్కడ ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని అన్నారు. టీడీపీ నేతలు కాని ఇప్పుడు వెళ్తే, వైసీపీ నేతలు కూడా పరామర్శలకు వెళ్తామని అంటారు పరిస్థితులు మళ్లీ అదుపు తప్పే అవకాశం ఉందని తెలిపారు. పరామర్శలకు ఈ సమయంలో వెళ్లొద్దని రాజకీయనేతలకు ముఖేష్ కుమార్ మీనా విజ్ఞప్తి చేశారు. బయటి నుంచి నేతలు ఎవ్వరూ పరామర్శకు వెళ్లకూడదని తెలిపారు. బయటివారిని ఎవ్వరినీ ఆ గ్రామాల్లోనికి వెళ్లనీయవద్దని సూచనలు జారీ చేశామన్నారు.